Jio-Google ఒప్పందం!!! చైనా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు గడ్డు కాలం మొదలైనట్లే...

|

భారతీయ మార్కెట్లో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో ఇప్పుడు తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తో జత కట్టింది. ఈ తాజా ఒప్పందంతో ఇండియాలో 4G నెటవర్క్ ను 5G నెటవర్క్ గా మార్చడానికి మరింత సులభతరం చేస్తోంది. దీని యొక్క ప్రభావం ఇండియాలో సరసమైన ధరల వద్ద స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ లాంచ్ చేస్తూ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ఆధిపత్యం వహించే చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు చేదు అనుభవాన్ని మిగిలిస్తున్నది.

భారతదేశంలో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌

భారతదేశంలో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు భారతదేశంలో 80% స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఆక్రమించి ఉన్నారు. ఏదేమైనా జియో-గూగుల్ భాగస్వామ్యంతో 4G నుండి 5G కి పరివర్తనం చెందడంతో చైనా బ్రాండ్ల యొక్క మార్కెట్ మీద ప్రభావం భారీగానే తాకనున్నది అని ప్రముఖ టెక్నాలజీ సంస్థ సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) తన అభిప్రాయంను వ్యక్తం చేసింది. జియో-గూగుల్ యొక్క కొత్త డీల్ లో భాగంగా జియో సంస్థ ప్రస్తుత చైనీస్ బ్రాండ్ లకు పోటీగా గూగుల్‌తో కలిసి సరసమైన ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉందని CMR ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్‌ రీసెర్చ్ అనలిస్ట్‌ అమిత్ శర్మ పేర్కొన్నారు.

 

Also Read: Reliance Jio 5G గురించి ఆసక్తికరమైన విషయం...Also Read: Reliance Jio 5G గురించి ఆసక్తికరమైన విషయం...

Jio-Google భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం

Jio-Google భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం

గూగుల్ మరియు జియో కొత్త భాగస్వామ్యంలో గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను జియో సంస్థ మార్కెట్లో ప్రారంభించబోయే స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ప్లే స్టోర్‌లకు ఆప్టిమైజేషన్లను అందిస్తుంది. రిలయన్స్ జియో మరియు గూగుల్ రెండు సంస్థల స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరల వద్ద తక్కువ-ఆదాయ వినియోగదారులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే రూ .10,000 నుంచి రూ.20,000 ధరల పరిధిలో సరసమైన 5G వేరియంట్‌ను విడుదల చేయడం అనేది తక్కువ ఆదాయ వినియోగదారులతో పాటు మధ్య తరగతి ఆదాయం మీద కూడా ప్రభావం చూపుతుంది.

భారతదేశంలో 5G డిజిటల్ సేవలు

భారతదేశంలో 5G డిజిటల్ సేవలు

భారతదేశంలో 5G స్పెక్ట్రం వేలం మొదలవ్వడానికి ఇంకా సంవత్సరం సమయం ఉంది. అలాగే ఈ సమయం లోపు జియో సంస్థ తన సరసమైన 4G లేదా 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) లో పరిశోధనా డైరెక్టర్‌గా ఉన్న నవకేందర్ సింగ్ వందలాది మంది ఫీచర్ యూజర్‌లను స్మార్ట్‌ఫోన్‌లకు తరలించడానికి మరియు డిజిటల్ సేవలను ఉపయోగించడం ద్వారా డిజిటల్ ఎకానమీకి దోహదం చేయడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.

రిలయన్స్‌ జియోలో క్వాల్‌కామ్ పెట్టుబడి

రిలయన్స్‌ జియోలో క్వాల్‌కామ్ పెట్టుబడి

రిలయన్స్ జియో యొక్క ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే వివిధ గ్లోబల్ బ్రాండ్ల సంస్థలు పెట్టుబడులను పెట్టాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన చిప్ డిజైనర్ క్వాల్కమ్ కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.730 కోట్లతో 0.15% వాటాకు బదులుగా పెట్టుబడి పెట్టింది. క్వాల్కమ్-జియో ఒప్పందంతో రెండు కంపెనీలు ఇప్పటికే సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం. అలాగే క్వాల్‌కామ్ జియో వినియోగదారుల కోసం 4G ఫీచర్ ఫోన్ చిప్‌సెట్‌ను ఇప్పటికే విడుదల చేసింది.

Best Mobiles in India

English summary
Jio- Google New Deal: China Smartphone Brand Could Trouble in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X