జియోపై ముప్పేట దాడి, సరికొత్త డేటా ఆఫర్లతో దూసుకొచ్చిన టెలికాం దిగ్గజాలు !

Written By:

దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న జియోపై ఇప్పుడు ముప్పేట దాడి చేసేందుకు టెలికాం దిగ్గజాలు రెడీ అయ్యాయి. టాప్ టెలికాంలు ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు జియో ప్లాన్లకు కౌంటర్ గా సరికొత్త ప్లాన్లను తీసుకువస్తున్నాయి. జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్లకు పోటీగా తమ యూజర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.

జియోని వదిలిపెట్టని ఎయిర్‌టెల్, కొత్త ఆఫర్లతో మళ్లీ కౌంటర్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్‌

ఈ దిగ్గజం తన రూ.448 ప్లాన్‌లో మార్పులు చేసింది. 70 రోజుల వ్యాలిడిటీని 82 రోజులకు పెంచింది. అలాగే రూ.509 ప్లాన్‌లో 84 రోజుల నుంచి 91 రోజులకు పెంచింది. డేటా రోజుకు 1జిబి లెక్కన వ్యాలిడిటీ రోజుల మొత్తానికి లభిస్తుంది.

వొడాఫోన్‌

ఈ దిగ్గజం తన రూ.458 ప్లాన్లో మార్పులు చేసింది. 70 రోజుల కాలపరిమితిని 84 రోజులకు పెంచింది. అలాగే రూ.509 ప్లాన్ 84 రోజుల నుంచి 91 రోజులకు పెంచింది. డేటా రోజుకు 1జిబి లెక్కన వ్యాలిడిటీ రోజుల మొత్తానికి లభిస్తుంది.

ఐడియా

ఈ దిగ్గజం తన రూ.449 ప్లాన్లో మార్పులు చేసింది. 70 రోజుల వాలిడిటీని 82 రోజులు చేసింది. అలాగే రూ.509 ప్లాన్లో 84 రోజుల వ్యాలిడిటీని 91 రోజులకు పెంచింది. డేటా రోజుకు 1జిబి లెక్కన వ్యాలిడిటీ రోజుల మొత్తానికి లభిస్తుంది.

జియో ఇప్పటికే..

జియో ఇప్పటికే పలు పాత ప్లాన్లను మార్చి కొత్త ప్లాన్లను రూ.50 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులోకి తేవడమే కాకుండా, పలు ఇతర ప్యాక్‌లపై 50 శాతం అదనపు డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే.  

జియోలో రూ.449, రూ.498 ప్లాన్లు..

కాగా జియోలో రూ.449, రూ.498 ప్లాన్లు 91 రోజుల వాలిడిటీని కలిగి ఉండగా, వీటిలో కస్టమర్లకు వరుసగా రోజుకు 1జీబీ, 1.5 జీబీ డేటా లభిస్తున్నది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Happy New Year 2018 offers: Bharti Airtel, idea Vodafone counter with thier own data plans more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot