జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ : ఎక్కువ డేటా, తక్కువ డబ్బులు !

Written By:

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపిన రిలయన్స్ జియో అదే వేగంతో ముందుకు దూసుకుపోతోంది. కనివినీ ఎరుగని రీతిలో టెలికాం దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన ముకేష్ అంబాని తమ వినియోగదారుల కోసం న్యూ ఇయర్ ప్లాన్ పేరుతో ఓ సరికొత్త ప్లాన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తక్కువ డబ్బులు ఎక్కువ డేటాతో ఈ ప్లాన్ ఇప్పుడు మిగతా దిగ్గజాలకు సవాల్ విసురుతోంది.

నడిసంద్రంలో అనిల్ అంబాని, ఆర్‌కామ్ పయనమెటు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యాపీ న్యూఇయర్‌ 2018 కింద..

హ్యాపీ న్యూఇయర్‌ 2018 కింద జియో కొత్తగా రూ.199, రూ. 299తో రెండు రకాల ప్లాన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇవి నేటి అర్థరాత్రి నుంచి యూజర్లందరికీ అందుబాటులో ఉంటాయి.

రూ. 199 ప్లాన్

ఈ ప్లాన్లో యూజర్లకు నెల రోజుల పాటు ఉచిత వాయిస్‌, అపరిమిత డేటా(రోజుకు 1.2జీబీ హైస్పీడ్‌ 4జీ డేటా), అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు‌, జియో ప్రైమ్‌ మెంబర్లందరికీ ప్రీమియం జియో యాప్స్‌ లభిస్తాయి.

రూ.299 ప్లాన్‌

ఈ ప్లాన్లో యూజర్లకు నెల రోజుల పాటు ఉచిత వాయిస్‌, అపరిమిత డేటా(రోజుకు 2జీబీ హైస్పీడ్‌ 4జీ డేటా), అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు,జియో ప్రైమ్‌ మెంబర్లందరికీ ప్రీమియం జియో యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తాయి.

ఇప్పటికే రూ.149 ప్లాన్‌ ఆఫర్

జియో ఇప్పటికే రూ.149 ప్లాన్‌ ఆఫర్ చేస్తున్నసంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్లాన్‌ కింద 28 రోజుల పాటు 4జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది.

ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌

కాగా ఇప్పటికే ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను మరో 10 రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

రూ.2599 వరకు ప్రయోజనాలు

నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 25 మధ్యలో రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేయించుకునే యూజర్లకు రూ.2599 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి.

మైజియో, జియో.కామ్‌ సైటు ద్వారా..

మైజియో, జియో.కామ్‌ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేసుకున్న సబ్‌స్క్రైబర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్‌ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Happy New Year plan: 1.2GB data per day for 28 days at Rs 199 and more read more once at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot