జియో హోళీ ఆఫర్, తక్కువ ధరకే జియో ఫోన్ సొంతం చేసుకోండి
దేశీయ టెలికం రంగంలో పెను ప్రకంపనలు రేపిన రిలయన్స్ జియో అదే ఊపుతో ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి వచ్చి రావడంతోనే అందులో దుమ్మురేపే అమ్మకాలను రాబట్ట
దేశీయ టెలికం రంగంలో పెను ప్రకంపనలు రేపిన రిలయన్స్ జియో అదే ఊపుతో ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి వచ్చి రావడంతోనే అందులో దుమ్మురేపే అమ్మకాలను రాబట్టింది. ప్రతి ఒక్కరి చేతులో జియో ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు ఆ ఫోన్ సొంతం చేసుకోలేని వారికి మళ్లీ అదిరిపోయే అవకాశాన్నిఅందించేందుకు రెడీ అయింది.

జియో హోలీ ఆఫర్ తో మళ్లీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఈ సారి రిలయన్స్ జియో అందిస్తున్న ప్లాన్ ని ఓ సారి పరిశీలిస్తే..

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్
రిలయెన్స్ జియో హోలీ సందర్భంగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. మీ దగ్గరున్న పాత ఫోన్ ఇచ్చేసి రూ.1,095 చెల్లించి జియో ఫోన్ తీసుకోవచ్చు.

రూ.594 విలువైన రీఛార్జ్ బెనిఫిట్స్
ఎక్స్‌ఛేంజ్‌లో తీసుకున్నవారికి రూ.594 విలువైన రీఛార్జ్ బెనిఫిట్స్ లభిస్తాయి. 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ పొందొచ్చు. అంటే మీకు ఫోన్ రూ.501 ధరకే లభించినట్టు. అది కూడా రీఫండబుల్ డిపాజిట్. వాస్తవానికి ఆ ఫోన్ అసలు ధర రూ.1,500గా ఉంది.

jio.com ఓపెన్ చేసి
మీరు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటే రిలయెన్స్ జియో వెబ్‌సైట్ అయిన jio.com ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మీకు దగ్గర్లో ఉన్న జియో స్టోర్‌లో ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయొచ్చు.

రీఫండబుల్ డిపాజిట్
ఎక్స్‌ఛేంజ్ వద్దనుకుంటే మీరు ఈ ఫోన్ మాత్రమే కొనొచ్చు. ఇందుకోసం రూ.1,500 చెల్లించాలి. మీరు చెల్లించే రూ.1,500 రీఫండబుల్ డిపాజిట్

జియో ఫోన్ కు సూటయ్యే ప్లాన్లు
జియో రూ.49 ప్లాన్, జియో రూ. 99 ప్లాన్, జియో రూ. 153 ప్లాన్, జియో రూ.297 ప్లాన్, జియో రూ. 594 ప్లాన్ .. ఈ ప్లాన్లలో ఏ ప్లాన్ అయినా వేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








