రూ.200కే Jio టీవి సేవలు, సిమ్‌తో జియో ల్యాపీలు, రిలీజ్ తేదీ ఎప్పుడంటే ?

దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియో మరో సరికొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తోంది.

|

దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియో మరో సరికొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తోంది. వచ్చిన ఏడాదిలోనే టెలికాం రంగంలో టాప్ బ్రాండ్ గా ఎదిగిన జియో టెలికాం దిగ్గజాలకు సవాల్ విసిరి వాటిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఉచిత ఆఫర్లతో మొదలు పెట్టి, అతి తక్కువ కాలంలోనే 10కోట్లమంది చందాదారులను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత కూడా అతి తక్కువ ధరకే ఎక్కువ డేటాను అందిస్తూ వేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. అయితే ఇప్పుడు జియో హోమ్ బ్రాండ్ పేరిట సరికొత్త టీవీలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ మూడో క్వార్టర్‌లో రానున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు మీకోసం...

ఆసక్తిరేపుతున్న ఫ్లిప్‌కార్ట్ టీజర్, కొత్తగా ఏం తీసుకువస్తోంది ?ఆసక్తిరేపుతున్న ఫ్లిప్‌కార్ట్ టీజర్, కొత్తగా ఏం తీసుకువస్తోంది ?

జియో హోమ్‌ టీవీ..

జియో హోమ్‌ టీవీ..

జియో త్వరలోనే ‘జియో హోమ్‌ టీవీ' పేరిట సరికొత్త సేవలను ప్రారంభించనుందనే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జియోహోమ్‌ టీవీ సర్వీసు కింద జియో ఎస్‌డీ, హెచ్‌డీ ఛానల్స్‌ను రూ.400కే అందించాలని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

జియో రూ.200కు..

జియో రూ.200కు..


టెలికాంటాక్‌ రిపోర్టు ప్రకారం జియో రూ.200కు ఎస్‌డీ ఛానల్స్‌ను, రూ.400కు ఎస్‌డీప్లస్‌హెచ్‌డీ ఛానల్స్‌ను జియోహోమ్‌ టీవీ సర్వీసుతో ఆఫర్‌ చేయనున్నట్టు తెలిసింది. అయితే జియోహోమ్‌ టీవీ సర్వీసులను ప్రత్యేకంగా అందించనుందని రిపోర్టు చెబుతోంది.

కంపెనీ ఎప్పటి నుంచో..

కంపెనీ ఎప్పటి నుంచో..

కంపెనీ ఎప్పటి నుంచో సొంతంగా డీటీహెచ్‌ సర్వీసులను భారత్‌లో లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రిపోర్టుల ప్రకారం మెరుగైన మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్‌ మల్టీకాస్ట్ సర్వీస్(ఈఎంబీఎంఎస్‌) కింద జియోహోమ్‌ టీవీ రన్‌ అవనున్నట్టు తెలిసింది.

eMBMS టెక్నాలజీ ద్వారా..

eMBMS టెక్నాలజీ ద్వారా..

eMBMS టెక్నాలజీ ద్వారా జియో తన సేవలను అందించనుందని తెలుస్తోంది. ఎంబీఎంఎస్‌ అనేది హైబ్రిడ్‌ టెక్నాలజీ. ఎన్‌హేన్సడ్‌ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్‌ మల్టీకాస్ట్‌ సర్వీస్‌(ఈఎంబీఎంఎస్‌) దీని సంక్షిప్త రూపం. ఈ టెక్నాలజీ ఒకే సారి పెద్ద మొత్తంలో యూజర్లను పొందగలదు. గత రెండేళ్లుగా ఈ సర్వీసులను జియో టెస్ట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి..

ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి..

కాగా టెలికాం సర్వీసులు, స్మార్ట్‌ఫోన్లు, 4జీ ఫీచర్‌ ఫోన్‌ వంటి వాటితో ఇప్పటికే మార్కెట్‌లో తిరుగులేకుండా ఉన్న జియో.. ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెరతీయబోతోందని తెలుస్తోంది. తన ARPU(యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌)ను పెంచుకోవడం కోసం సిమ్‌ కార్డుతో కూడిన ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది.

చర్చలు..

చర్చలు..

దీనిపై ఇప్పటికే అమెరికా చిప్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌తో ముకేష్‌ అంబానీకి చెందిన జియో కంపెనీ చర్చలు కూడా జరిపిందని సమాచారం. బిల్ట్‌-ఇన్‌ సెల్యులార్‌ కనెక్షన్స్‌తో విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే ల్యాప్‌టాప్‌లను రిలయన్స్ జియో మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి.

జీ ఫీచర్‌ ఫోన్‌ కోసం..

జీ ఫీచర్‌ ఫోన్‌ కోసం..

కాగా క్వాల్‌కామ్‌ ఇప్పటికే 4జీ ఫీచర్‌ ఫోన్‌ కోసం జియోతో కలిసి పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మిగ్యుల్ న్యున్స్ స్పందిస్తూ జియోతో మేము మాట్లాడాం. డేటా, కంటెంట్‌తో కూడిన ఒక డివైజ్‌ను వారు తేవాలనుకుంటున్నారని చెప్పారు.

ఈ విషయంపై స్పందించడానికి ..

ఈ విషయంపై స్పందించడానికి ..

అయితే ఈ విషయంపై స్పందించడానికి రిలయన్స్‌ జియో నిరాకరించింది. మరి ఈ వార్తలు నిజమైతే ల్యాపీ ప్రపంచంలో మరో విప్లవానికి తెరలేచినట్లేనని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Jio Home TV eMBMS Service Said to Offer HD Channels at Rs. 400 Per Month More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X