30 జిబి 4జీ డేటా ఉచితం

Written By:

టెలికం రంగంలో టాప్ లో దూసుకుపోతున్న భారతి ఎయిర్‌టెల్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. జియోకి ధీటుగా ఆఫర్ల ప్రకటిస్తూ తమ వినియోగదారులు చేజారిపోకుండా కాపాడుకునేందుకు కసరత్తులు బాగా చేస్తోంది. ఇందులో భాగంగా తన పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులకోసం సరికొత్త డేటా ప్లాన్‌ను ప్రకటించింది.

మళ్లీ పంజా విప్పనున్న Airtel..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మాన్సూన్ సర్ప్రైజ్ ఆఫర్

మాన్సూన్ సర్ప్రైజ్ ఆఫర్ పేరుతో సంచంలనం సృష్టించేందుకు ఎయిర్‌టెల్‌ రెడీ అయింది. జూలై 1 ఒకటినుంచి ఈ ప్లాన్ అమలు కానుంది. డేటా సర్‌ప్రైజ్‌ కు కొనసాగింపుగా ఈ డేటా ప్లాన్లను వెల్లడించింది.

మూడు నెలలపాటు

వీటిల్లో మూడు నెలలపాటు అదనంగా 30జీబీ 4 జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది. రూ. 499, రూ.649, రూ 799 ప్లాన్లలో ఈ ఆఫర్‌ వర్తించనుంది.

పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లకు

ఈ ప్లాన్లను ఎంపిక చేసుకున్న తమ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లకు అదనంగా ఈ ప్రయోజనాలకు సెప్టెంబరు నెల వరకు అందించనున్నామని ఎయిర్‌టెల్‌ సిఇఓ గోపాల్ విఠల్‌ చందాదారులకు ఇమెయిల్‌ సమాచారంలో తెలిపారు.

4జీ హ్యాండ్ సెట్లలో మాత్రమే

ఈ ఉచిత డేటా ఆఫర్ 4జీ హ్యాండ్ సెట్లలో మాత్రమే చెల్లుతుంది. అలాగే మూడు నెలల తర్వాత ఈ ఆఫర్‌ ఆటోమేటిక్‌గా వెనక్కి తీసుకోబడుతుందని ఎయిర్టెల్ వెబ్‌సైట్లో పేర్కొంది.

ఈ అదనపు 30జీబీ డేటా కోసం

ఈ అదనపు 30జీబీ డేటా కోసం, ప్లేస్టోర్‌, లేదా ఆప్‌ స్టోర్‌ నుంచి ఎయిర్‌ టెల్‌ టీవీ ఆప్‌ డౌన్లోడ్ చేసిన తర్వాత, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఆఫర్ను క్లెయిమ్ చేయవచ్చని తెలిపింది. ఇప్పటికే డేటా సర్‌ప్రైజ్‌ ఖాతాదారులకు కూడా మూడు నెలల అదనపు డేటా వర్తిస్తుందని తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Impact: Airtel Is Offering 30GB Free 4G Data, Details Here read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot