Home
News

Jioతో పోటీకి సై.. భారీగా రేట్లు తగ్గించిన ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్

By Sivanjaneyulu Bommu

భారీ ఆఫర్లతో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న రిలయన్స్ జియో 4జీతో పోటీ పడేందుకు ఇతర టెలికామ్ ఆపరేటర్ల సిద్దమయ్యాయి. నష్ట నివారణా చర్యల్లో భాగంగా ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ టెలికామ్ ఆపరేటర్లు తమ చందదారులు చేజారిపోకుండా ఉచిత అన్‌లిమిటెడ్ డేటా‌ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : వాట్సాప్‌లో అలాంటివి పోస్ట్ చేస్తే జైలుకే!

బీఎస్ఎన్ఎల్ నుంచి

బీఎస్ఎన్ఎల్ నుంచి

జియో 4జీకి పోటీగా బీఎస్ఎన్ఎల్ నేషన్‌వైడ్ అన్‌లిమిటెడ్ 3జీ మొబైల్ డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాంగా రూ.1,099 చెల్లించినట్లయితే 30 రోజుల పాటు 3జీ డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ నుంచి

బీఎస్ఎన్ఎల్ నుంచి

కొన్ని Existing planలకు సంబంధించి బీఎస్ఎన్ఎల్ డేటా లిమిట్‌ను డబల్ చేసింది. ఉదాహరణకు మీరు రూ.549 ప్లాన్‌లో ఉన్నట్లయితే ఇకనుంచి మీరు 10జీబి 3జీ డేటాను ఆస్వాదించవచ్చు. ఈ 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో భాగంగా గతంలో 5జీబి డేటాను మాత్రమే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసేది. అలానే రూ.156 ప్లాన్‌లో ఉన్న యూజర్లు 2జీబి 3జీ డేటాను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 10 రోజులు మాత్రమే.

Airtel నుంచి

Airtel నుంచి

రిలయన్స్ జియోకు పోటీగా Airtel సరికొత్త Infinity planతో ముందుకొచ్చింది. ఈ ప్లాన్ క్రింద అన్‌లిమిటెడ్ మొబైల్ కాల్స్‌తో పాటు 3G/4G డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ విలువ రూ.1,199. ఈ వాయిస్ కాలింగ్ ప్లాన్‌లో భాగంగా local, STD ఇంకా roaming కాల్స్‌ను అపరిమితంగా ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా Wynk Movies అలానే Wynk Musicకు సంబంధించి ఉచిత సబ్‌స్ర్కిప్షన్‌ను పొందవచ్చు.

Airtel నుంచి

Airtel నుంచి

Airtel ఆఫర్ చేస్తున్న మరో ప్లాన్‌లో భాగంగా రూ.1,599 చెల్లించినట్లయితే నెలరోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 5జీబీ 3G/4G డేటా అలానే Wynk సర్వీసులను ఉచితంగా సబ్ స్ర్కైబ్ చేసుకోవచ్చు. రూ.1,999, రూ.2,999 ప్లాన్స్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు 10జీబి, 20జీబి 3G/4G డేటాను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

ఐడియా నుంచి

ఐడియా నుంచి

రిలయన్స్ జియోకు పోటీగా 4జీ రేసులో తన సత్తాను చాటుకునేందుకు ఐడియా సెల్యులార్ ఆకట్టుకునే ఆఫర్‌తో ముందుకొచ్చింది. తమ నెట్‌వర్క్ పరిధిలో 4జీ సిమ్ కార్డ్‌కు అప్‌గ్రేడ్ అయ్యే వారికి 1జీబి 4జీ డేటాను ఐడియా ఆఫర్ చేస్తోంది.

వొడాఫోన్ నుంచి...

వొడాఫోన్ నుంచి...

రిలయన్స్ జియోకు పోటీగా వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ సర్వీసును మార్కెట్లో లాంచ్ చేసింది. అన్‌లిమిటెడ్ రోమింగ్ అలానే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ , 8జీబి 4జీ డేటాతో వస్తోన్న ఈ ప్లాన్ విలువ రూ.1,999. మరో ప్లాన్ రూ.1,699లో భాగంగా 6జీబి 4జీ డేటాను ఆస్వాదించవచ్చు. రెడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను వొడాఫోన్ రూ.499, రూ.699, రూ.999 రేంజ్ లో ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది.

Best Mobiles in India

English summary
Jio Impact: Leading Telcos Announce Unlimited Data and Calls to Combat Reliance. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X