జియో సినిమా ప్రీమియం సహా OTT సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!
జియో సినిమా యాప్ కోసం ఇటీవల రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.29, రూ.89తో ప్లాన్‌లను తీసుకొచ్చింది. యాడ్స్ లేకుండా 4K నాణ్యతతో కంటెంట్‌ను వీక్షించవచ్చు. అయితే తాజాగా జియో నాలుగు ప్లాన్‌లను (Jio New Recharge Plans) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రూ.28, రూ.89 ప్లాన్‌ల ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ప్రస్తుతం జియో 4 ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను కలిగి ఉంది. దీని ద్వారా జియో సినిమా ప్రీమియం, OTT లను కూడా అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌ల ద్వారా కూపన్‌లను పొందవచ్చు. వీటిని వినియోగించుకోవడం (Redeem) చేయడం ద్వారా జియో సినిమా ప్రీమియం ను ఉచితంగా పొందవచ్చు.

జియో రూ.148 రీఛార్జీ ప్లాన్ ద్వారా 28 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 10GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 12 OTT ప్లాట్‌ఫాంల యాక్సెస్‌ను పొందవచ్చు. జియో సినిమా ప్రీమియం, సోనీ LIV, Zee5, Sun NXT మరియు డిస్కవరీ+ సహా మరిన్ని ఓటీటీలను వినియోగించుకోవచ్చు.
జియో రూ.389 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా ప్రయోజనాలను పొందవచ్చు. రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియో సినిమా ప్రీమియం సహా 12 OTT ప్లాట్‌ఫాం లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు వినియోగదారులు 6GB 4G డేటాను అదనంగా పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.
జియో రూ.1198 ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. రోజువారీ 2GB చొప్పున 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G సహా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీం జియో రూ.1198 ప్లాన్ తోపాటు 12 OTT ప్లాట్‌ఫాంలను వినియోగించుకోవచ్చు. ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ సహా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు.
దీంతోపాటు జియో రూ.4,498 ప్లాన్ ద్వారా సంవత్సరం పాటు కాలింగ్, డేటా ప్రయోజనాలను పొందవచ్చు. రోజు వారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 78GB అదనపు డేటాను పొందుతారు. మరియు 14 OTT ప్లాట్‌ఫాం లను వినియోగించుకోవచ్చు. జియో సినిమా ప్రీమియం ప్రయోజనాలను పొందవచ్చు.
* ఇటీవల జియో అందుబాటులోకి తీసుకొచ్చిన రూ.28 ప్లాన్ ద్వారా యాడ్ ఫ్రీ కంటెంట్ సహా 4k నాణ్యతతో వీడియోలను వీక్షించవచ్చు. మరియు ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్‌ను చూడవచ్చు. సిరీస్‌లు, సినిమాలు, చిన్నారులకు సంబంధించిన షోలు మరియు ఇతర టీవీ షోలను వీక్షించవచ్చు.
నెలకు రూ.89 తో మరో ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఫ్యామిలీ ప్లాన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 4 పరికరాల్లో ఒకేసారి కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రస్తుతం జియో సినిమా ప్రీమియం వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుం లేకుండా ఆటోమేటిక్‌గా ఈ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు.
ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లను (IPL 2024) ఉచితంగా ప్రసారం చేస్తున్నా.. ఈ రెండు కొత్త ప్లాన్లతో యాడ్స్ లేకుండానే వీడియోలను వీక్షించవచ్చు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా చిన్నారులు సహా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఈ జియో సినిమా చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా Parental కంట్రోల్ ఫీచర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








