Home
News

జియో ఢమాకా, ఉచితంగా ICC Cricket World Cup 2019 మొత్తం చూసేయండి

దేశీయ టెలికాం రంగంలో తిరుగులేకుండా దూసుకుపోతున్న టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ICC World Cup 2019 లైవ్ మ్యాచ్ లు చూసే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇకపై పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా జియో యూజర్లంతా పూర్తి ఉచితంగా వరల్డ్ కప్ మ్యాచ్ లు చూడవచ్చు.

జియో ఢమాకా, ఉచితంగా ICC Cricket World Cup 2019 మొత్తం చూసేయండి

దీంతో పాటు My Jio appపై 'జియో క్రికెట్ ప్లే’ అనే మినీ గేమ్ ఆడటం ద్వారా కూడా యూజర్లు ఎన్నో ప్రైజ్ లు గెలుచుకోవచ్చు. అంతేకాదు.. ఓటీటీ ప్లాట్ ఫాంలో లైవ్ స్ట్రీమింగ్ యాప్ Hotstar భాగస్వామ్యంతో రిలయన్స్ జియో తమ యూజర్లకు స్పోర్ట్స్ ప్యాక్స్ కూడా అందిస్తోంది.

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి

ఈ స్పోర్ట్స్ ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.365 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు రిలయన్స్ జియో సబ్ స్ర్కైబర్లు అన్ని వరల్డ్ కప్ 2019 మ్యాచ్ లను హాట్ స్టార్ నుంచి లైవ్ ద్వారా చూడవచ్చు. Hotstar విజిట్ చేయగానే జియో యూజర్లు అందరూ ఆటోమాటిక్ గా అన్ని వరల్డ్ కప్ మ్యాచ్ లను యాక్సస్ చేసుకోవచ్చు. Jio TV app ద్వారా యాక్సస్ చేసుకునే యూజర్లు హాట్ స్టార్ యాప్ కు రీడైరెక్ట్ అవుతారు.

రూ.251తో రీఛార్జ్

రూ.251తో రీఛార్జ్

రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం కొత్త డేటా ప్యాక్ ప్రవేశపెట్టింది. అదే.. అన్ లిమిటెడ్ క్రికెట్ సీజన్ డేటా ప్యాక్. స్పోర్ట్స్ డేటా ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.251తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కింద 51 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం 102 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ డేటా ప్లాన్ ద్వారా అన్ని ప్రపంచ క్రికెట్ మ్యాచ్ లను చూడవచ్చు. అంతేకాదు.. ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేయవచ్చు.

Mini Game

Mini Game

జియో క్రికెట్ ప్లేతో పాటు Mini Game రెండు ఆఫర్లను.. జియో యూజర్లతో పాటు ఇతర నెట్ వర్క్ యూజర్లు కూడా వినియోగించుకోవచ్చు. ఈ గేమ్ లో రియల్ టైం క్రికెట్ అప్ డేట్స్ కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనిద్వారా యూజర్లు క్రికెట్ పై తమ పరిజ్ఞానాన్ని చెక్ చేసుకోవచ్చు కూడా. ప్రస్తుతం ఈ మినీ గేమ్ యాప్.. కంపెనీ MyJio యాప్ లో అందుబాటులో ఉంది. ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి మినీ గేమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 జియో, నాన్ జియో సబ్‌స్క్రైబర్లకు

జియో, నాన్ జియో సబ్‌స్క్రైబర్లకు

స్కోర్స్, మ్యాచ్ షెడ్యూల్స్, రిజల్ట్స్ తెలుసుకోవడంతో పాటు కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. ఈ గేమ్ జియో, నాన్ జియో సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మైజియో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ బాల్, ప్రతీ ఓవర్, ప్రతీ మ్యాచ్‌కు ఏం జరుగుతుందో కాంటెస్ట్‌లో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా పాయింట్లు గెలుచుకోవచ్చు. ఎక్కువ పాయింట్స్ గెలిచినవారికి బహుమతులు ఉంటాయి.

టాప్ 5 జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌

టాప్ 5 జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌

జియో రూ.98 ప్లాన్:

ఇది చీప్ అండ్ బెస్ట్ ప్లాన్. తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. మీరు తక్కువ డేటా ఉపయోగిస్తారంటే ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. 28 రోజుల వేలిడిటీ. 2జీబీ డేటా వస్తుంది. దాంతోపాటు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో సేవల్ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

జియో రూ.299 ప్లాన్:

మీరు డేటా ఎక్కువగా ఉపయోగిస్తారా? అయితే రోజూ 3జీబీ డేటా పొందొచ్చు. సినిమాలు, వెబ్‌సిరీస్, క్రికెట్ లాంటివి ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో చూసేవారికి ఉపయోగపడే ప్లాన్ ఇది. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో సినిమా, జియోటీవీ, ఏజియోతో పాటు ఇతర జియో సేవల్ని పొందొచ్చు.

 

జియో రూ.398 ప్లాన్:

మీరు రోజుకు కనీసం 2 జీబీ డేటా వాడుతుంటారా? అయితే రూ.398 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. 70 రోజుల పాటు రోజుకు 2 జీబీ 4జీ డేటా పొందొచ్చు. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ఉచితం. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

 

జియో రూ.449 ప్లాన్:

మీరు డేటా కాస్త తక్కువగా ఉపయోగిస్తారంటే రూ.449 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. 91 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల పాటు సేవలు పొందొచ్చు. వాయిస్, వీడియో కాల్స్ ఉచితం. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా ఉపయోగించుకోవచ్చు.

 

జియో రూ.1,699 ప్లాన్:

మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకోకుండా లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? అయితే రూ.1,699 ప్లాన్ ట్రై చేయొచ్చు. 365 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా లభిస్తుంది. అంటే 547.5 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్, వీడియో కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
icc cricket world cup 2019 jio introduces unlimited data pack allows users to live stream matches for free
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X