లక్ష ఉద్యోగాలతో జియో దూకుడు, రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు !

By Hazarath
|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో పెట్టుబడుల్లోనూ అదే స్థాయిలో దూసుకెళుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో రూ.20వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, మరో రూ.10వేల కోట్లను వచ్చే మూడేళ్లలో పెట్టుబడులుగా పెట్టనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో డిజిటల్‌ సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఈ పెట్టుబడులను ఉపయోగించనున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ తెలిపారు. ఈ సంధర్భంగా ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావించారు.

 

రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను పెట్టడం ద్వారా..

రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను పెట్టడం ద్వారా..

ఉత్తరప్రదేశ్‌లో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను పెట్టడం ద్వారా జియో ఇక్కడ వచ్చే కొన్నేళ్లలో దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాలను సృష్టించనునందని జియో అధినేత పేర్కొన్నారు.డిజిటల్ ఇండియాను మరింత తీసుకెళ్లేందుకు ఇది ఊతంగా నిలుస్తుందని తెలిపారు.

అంబాని మాట్లాడుతూ..

అంబాని మాట్లాడుతూ..

ఈ సందర్భంగా అంబాని మాట్లాడుతూ గౌరవనీయులైన ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి హామి ఇ‍స్తున్నాను, ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడవడానికి జియో డిజిటల్‌ విప్లవం ద్వారా తమ వంతు సహకారం అందిస్తామని యూపీ పెట్టుబడిదారుల సదస్సులో తెలిపారు.

రెండేళ్ల కంటే తక్కవ వ్యవధిలోనే..
 

రెండేళ్ల కంటే తక్కవ వ్యవధిలోనే..

రూ.20వేల కోట్లకు పైగా పెట్టుబడులతో ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద పెట్టుబడిదారిలో ఒకటిగా జియో ఉందని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండేళ్ల కంటే తక్కవ వ్యవధిలోనే దేశవ్యాప్తంగా రిలయన్స్‌ వరల్డ్‌ క్లాస్‌ డిజిటల్‌ సదుపాయాలను అభివృద్ధి చేసిందని తెలిపారు.

అ‍త్యంత తక్కువ ధరలకు..

అ‍త్యంత తక్కువ ధరలకు..

ప్రపంచంలోనే అ‍త్యంత తక్కువ ధరలకు హై క్వాలిటీ డేటా సర్వీసులను జియో అందిస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2 కోట్ల మంది సిటిజన్లకు ఈ సేవలు అందుతున్నాయని చెప్పారు.

డిజిటల్‌ కమ్యూనికేషన్‌ సర్వీసులను..

డిజిటల్‌ కమ్యూనికేషన్‌ సర్వీసులను..

రైతులకు, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు, అతిపెద్ద వ్యాపారస్తులకు, ఆసుపత్రులకు, స్కూళ్లకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు ప్రయోజనాలను అందించడానికి తర్వాతి తరం డిజిటల్‌ కమ్యూనికేషన్‌ సర్వీసులను పునర్నిర్మాణం చేపట్టామని అంబానీ తెలిపారు.

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5శాతం వాటాను కొనుగోలు..

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5శాతం వాటాను కొనుగోలు..

ఇదిలా ఉంటే ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5శాతం వాటాను కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థ ద్వారా 4.875 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 320 కోట్లు) కొనుగోలు చేసింది.

 మీడియా కంపెనీలలో విరివిగా పెట్టుబడులు ..

మీడియా కంపెనీలలో విరివిగా పెట్టుబడులు ..

ఇటీవలికాలంలో మీడియా కంపెనీలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్‌ తాజాగా ఈరోస్‌ ఇంటర్‌ నేషనల్‌పై దృష్టిపెట్టింది. (ఇప్పటికే ఇంటిగ్రేట్ వయాకామ్, బాలాజీ టెలీఫిల్మ్స్ ఇపుడు ఈరోస్‌లో వాటాను కొనుగోలు చేసింది) ఈ ఒప్పందం ప్రకారం ఏరోస్‌ ఒక్కో షేరుకు 15 డాలర్లను చెల్లించనుంది.

ఏరోస్‌ సీఈవో, ఎండీ జ్యోతి దేశ్‌పాండే..

ఏరోస్‌ సీఈవో, ఎండీ జ్యోతి దేశ్‌పాండే..

మరోవైపు ఏరోస్‌ సీఈవో, ఎండీ జ్యోతి దేశ్‌పాండే తన పదవికి రాజీనామా చేశారు. 17ఏళ్లకు పైగా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఏరోస్‌కు సేవలందించిన ఆమె ఆర్‌ఐఎల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌కు హెడ్‌గా వ్యవహరించనున్నారు. 2018 ఏప్రిల్‌నుంచి తన బాధ్యతలను చేపట్టనున్నారు. అలాగే ఏరోస్‌ బోర్డ్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

సంతోషం వ్యక్తం చేసిన ముకేశ్‌ అంబానీ

సంతోషం వ్యక్తం చేసిన ముకేశ్‌ అంబానీ

ఏరోస్‌ భాగస్వామ్యం, రిలయన్స్ ఫ్యామిలీలకి జ్యోతి దేశ్‌పాండే ఆహ్వానించడం ఆనందంగా ఉందని ఆర్ఐఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. ఆమె కంపెనీ ప్రణాళికలకు ఊతమివ్వడమే కాకుండా , వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Best Mobiles in India

English summary
Jio to Invest Rs 10,000 Cr in UP, Create 1 Lakh Jobs in Next 3 Years More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X