జియో టీజర్‌లో చెప్పింది, కొత్తగా ఏం తీసుకొస్తోంది, ఓ స్మార్ట్ లుక్కేయండి

Written By:

దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలకు షాకిస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో రెండు రోజుల క్రితం ఓ టీజర్ ని పోస్ట్ చేసింది. అందులో ఏం ఉందోనని చాలామంది ఓపెన్ చేసి చూడగా జియో జ్యూస్ అనే పదం మాత్రమే కనిపించింది. బ్యాటరీకి సంబంధించి కొన్ని అక్షరాలు కనపడ్డాయి. అయితే అది ఏంటి..జియో కొత్తగా ఏం తీసుకువస్తోంది అనే సందేహాలు చాలామందికి కలిగాయి. అయితే వీటన్నింటికీ సమాధానాలు మాత్రం దొరకడం లేదు..ఎవరికి వారే ఏదేదో ఊహించుకుంటున్నారు. కాని జియో యూజర్లలో మాత్రం ఎడతెగని ఆసక్తి నెలకొని ఉంది. దిగ్గజాలకు మళ్లీ వణుకు మొదలైంది. జియో మళ్లీ ఏం తీసుకువస్తుందోనని కలవరపడుతున్నారు. ఇప్పటికే కోట్ల నష్టాల్లో మునిగికన కంపెనీలు ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్నాయి. మళ్లీ కొత్త ఆఫర్లతో జియో విరుచుకుపడితే ఎలా అనే ఆందోళన కూడా వారిలో ఉంది. మరి జియో టీజర్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దామా..

JioJuiceతో దుమ్మురేపిన ముకేష్ అంబానీ, యూజర్లకు పండగే, పూర్తి వివరాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరలోనే బ్యాటరీ సేవింగ్ యాప్ ?

జియో త్వరలో నూతనంగా జియో జ్యూస్ పేరిట‌ ఓ బ్యాటరీ సేవింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుందని టీజర్ ను బట్టి తెలుస్తోంది. ఇదే విషయాన్ని జియో తాజాగా పలు ట్వీట్ల ద్వారా చూచాయగా తెలియజేసింది.

జియో బ్యాటరీ సేవింగ్ యాప్‌కు చెందిన టీజర్‌ను ఇప్పటికే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది కూడా. అయితే ఈ యాప్ ఎప్పుడు, ఏ ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి వస్తుందనే వివరాలను మాత్రం జియో వెల్లడించలేదు. త్వరలో ఈ విషయాలు తెలిసే అవకాశం ఉంది.

జియో బ్యాటరీ సేవింగ్ యాప్‌కు చెందిన టీజర్‌ను ఇప్పటికే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది కూడా. అయితే ఈ యాప్ ఎప్పుడు, ఏ ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి వస్తుందనే వివరాలను మాత్రం జియో వెల్లడించలేదు. త్వరలో ఈ విషయాలు తెలిసే అవకాశం ఉంది.యాప్ ఎప్పుడు, ఏ ప్లాట్‌ఫాంపై

బీటా వర్షన్ లో

ఇది ఇప్పుడు బీటా వర్షన్ లో ఉంది. దీన్ని ఏప్రిల్ ఫస్ట్ నుంచి యూజర్లు బీటీ వర్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోచ్చు. దీని ద్వారా మీ ఫోన్ బ్యాటరీ మరింతగా సేవ్ చేసుకోవచ్చు. యాప్స్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ డిజిటల్ సేవలకు ఎటువంటి అంతరాయం కలగదని రిలయన్స్ జియో చెబుతోంది.

జియో పవర్ బ్యాంక్

అందులో ఇమేజ్ వేరే విధంగా కూడా చూపిస్తోంది. జియో నుంచి పవర్ బ్యాంక్ వస్తోందని వార్తలు కూడా వస్తున్నాయి. జ్యూస్ పవర్ బ్యాంక్ పేరిట జియో తన పవర్ బ్యాంక్ తీసుకురాబోతుందని తెలుస్తోంది. దీని ధర కూడా రూ. 500 లోపే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జియో జ్యూస్ ఆండ్రాయిడ్ ఫోన్

ఈ విషయం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రూమర్లు వస్తున్నాయి. జియో అత్యంత తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకువస్తుందనే ఊహగానాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. జియో వదిలిన టీజర్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.

జియో జ్యూస్ ఆఫర్స్

టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇప్పటికే ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన కస్టమర్లకు మరో ఏడాదిపాటు ఆ సభ్యత్వాన్ని ఉచితంగా పొడిగించుకునేందుకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్‌షిప్ పొందడం వల్ల జియోకు చెందిన ఎన్నో పెయిడ్ యాప్స్‌ను ప్రైమ్ మెంబర్లు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అనేక జియో యాప్స్ ప్రైమ్ కస్టమర్లకు లభిస్తున్నాయి కూడా. అయితే ఆ యాప్స్ జాబితాలోకి మరో కొత్త యాప్ వచ్చి చేరనుంది.

ఏప్రిల్ పూల్

ఇది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జియో ఏప్రిల్ పూల్ కోసం యూజర్లను సరదాగా ఆ టీజర్ పోస్ట్ చేసిందా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio have posted about Jio Juice Beta on their Facebook page and twitter handle. So what is Jio Juice?, let’s know about it.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot