జియో కౌన్ బనేగా క్రోర్ పతి, ఆడండి, గెలవండి

Written By:

సంచలనాల జియో మరో సంచలనానికి రెడీ కాబోతోంది. యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించబోతోంది. డేటాతో ఎంజాయ్ చేసిన యూజర్లకు ఇకపై కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించనుంది. 2017 కౌన్ బనేగా క్రోర్‌పతి కార్యక్రమానికి సంబంధించి జియో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. జియో ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కనుంది. ఎలాగంటే..

జియో లోగో వెనుక దాగిన రహస్యం అదే..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో చాట్ యాప్‌

జియో చాట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని... జియో కేబీసీ ప్లే ఎలాంగ్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే జియో సిమ్ వాడుతున్నట్టయితే లాగిన్ కావాల్సిన అవసరం లేకుండానే జియోచాట్ ఆన్‌లైన్ గేమ్‌లోకి వెళ్లవచ్చు.

టీవీ చానెల్‌లో కేబీసీ ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా

టీవీ చానెల్‌లో కేబీసీ ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా అదే ప్రశ్నకు జియో చాట్‌లో కనిపించిన ఆప్షన్ల నుంచి సమాధానం పంపాలి.

సమయం ముగిసేలోపు

హాట్ సీట్‌లో కూర్చున్న పోటీదారుడు సమాధానం చెప్పకముందు లేదా సమయం ముగిసేలోపు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

సరిగ్గా జవాబు చెబితే

సరిగ్గా జవాబు చెబితే హాట్ సీట్ కంటెస్టెంట్‌తో పాటు తదుపరి ప్రశ్నకు వెళ్లవచ్చు. అయితే ఒక్క ప్రశ్నకు సమాధానం తప్పుగా చెప్పినా మీ రౌండ్ ముగిసినట్టే. తర్వాత కొత్త రౌండ్‌ వేరే వాళ్లతో మొదలవుతుంది.

సరైన ఆన్సర్లు చెప్పిన వారికి

మొత్తం జియో కేబీసీ ప్లే ఎలాంగ్ గేమ్ వివిధ రౌండ్లలో పలువురు ప్లేయర్లతో జరుగుతుంది. సరైన ఆన్సర్లు చెప్పిన వారికి ఆ రౌండ్‌ను బట్టి పాయింట్లు లభిస్తాయి.

విజేతలను

తర్వాతి రోజు విజేతలను కేబీసీ హోస్ట్ అమితాబ్ బచ్చన్ ప్రకటిస్తారు. ఇందుకోసం కేబీసీతో ప్రత్యేకంగా సమన్వయం చేసుకుంటోంది. ‘ఘర్ బేటే జీతో' విజేతలందరికీ డాట్సన్ రెడిగో కారును బహూకరిస్తారు.

బహుమతి వస్తే మాత్రం

జియోకి బయట ఉన్న వినియోగదారులు కూడా ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని ఆడవచ్చు. అయితే బహుమతి వస్తే మాత్రం వాళ్లు జియో సిమ్ కొనాల్సి రావచ్చునని చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio gives users a chance to play Kaun Banega Crorepati 2017 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot