4జీ అయిపోయింది..ఇక 5జీ వైపు జియో చూపు

Written By:

ప్రివ్యూ ఆఫర్ తో దేశ వ్యాప్తంగా జియో సంచలనం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 5 నుంచి జియో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు మూడు నెలల పాటు అన్ లిమిటెడ్ కాల్ ఆఫర్లతో అదరగొట్టిన జియో భవిష్యత్ వైపు దృష్టి సారించింది. 4జీ నుంచి 5జీ 6జీ దిశగా ఇప్పటినుంచే వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదే విషయాన్ని ముఖేష్ అంబాని ఎజీఎమ్ మీటింగ్ లొ పరోక్షంగా ప్రస్తావించారు కూడా.

ఒక సిమ్‌తో 10 ఫోన్లకు జియోని పొందడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

జియో దేశ వ్యాప్తంగా 2 లక్షల 50 వేల కిలో మీటర్ల మేర ఫైబర్ ఆఫ్టిక్ ను 4జీ కోసం వేయనుందని ముఖేష్ అంబాని చెప్పారు. అయితే దీన్ని 5జీ, 6జీకి వాడుకునే విధంగా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

#2

రానున్న మూడు సంవత్సరాల్లో పైబర్ ఆఫ్టిక్ కేబుల్స్ 5జీని 6జీని సపోర్ట్ చేసే విధంగా మలుస్తామని ఆ దిశగానే అడుగులు వేస్తామని 4జీ వైర్లే 5జీకి కనెక్ట్ అయ్యే విధంగా గ్రామ గ్రామాలకు విస్తరిస్తామని అంబాని తెలిపారు.

#3

వచ్చే ఏప్రిల్ నాటికి గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఈ ఫైబర్ ద్వారా 1 మిలియన్ మందికి సేవలు అందించడమే లక్ష్యంగా జియో పనిచేస్తుందని తెలిపారు.

#4

వచ్చే తరానికి డిజిటల్ సర్వీసులు ప్రొవైడ్ చేసేది ఒక్క జియో మాత్రమేనని అన్ని మార్గాల ద్వారా కష్టమర్లకు చేరువ అయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ముఖేష్ అంబాని తెలిపారు.

#5

స్టార్టప్ లు అలాగే ఎంటర్ ప్రైజెస్‌లను కోసం పెద్ద మొత్తాన్నే కేటాయించామని, చిన్న తరహా పరిశ్రమలకు అలాగే ఎస్‌ఎమ్బిలకు హై స్పీడ్ ఐపీ నెట్ వర్క్ ద్వారా జియో సర్వీసులను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

#6

ఈ ఫైబర్ నెట్ వర్క్ ని అంతర్జాతీయ స్థాయి నెట్ వర్క్ లకు కనెక్ట్ అయ్యే విధంగా రూపొందిస్తున్నామని ప్రపంచంలో సగం ఇంటర్నెట్ ట్రాఫిక్ జియో నుంచి వెళ్లేలా చూస్తామని కష్టమర్ల సంతోషమే జియో ధ్యేయమని ఎజీఎమ్ మీటింగ్ లో అంబాని తెలిపారు.

#7

ఇప్పటికే రిలయన్స్ కమ్యూనికేషన్ ఈ ఫైబర్ ఆఫ్టిక్ ను దేశమంతా విస్తరించింది. అయితే ఇప్పుడున్నది సరిపోదని ఇప్పుడున్న దాని కన్నా దాదాపు 80 సార్లు ఫాస్ట్ గా బ్రాడ్ బ్యాండ్ రన్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం.

#8

ఈ పైబర్ నెట్ వర్క్ 1 Gbps స్పీడ్ ను ఆఫర్ చేస్తుందని ఇదే అత్యుత్తమ స్పీడ్ అని దీన్ని ఇంకా పెంచేందుకు కసరత్తులు చేస్తామని జియో అధినేత చెప్పారు. ఇప్పుడున్న బ్రాడ్ బాండ్ స్పీడ్ యావరేజ్ గా 3.5 Mbps ఉంది. దీన్ని పూర్తిగా జియో మార్చనుంది.

#9

అత్యధిక క్వాలిటీ వర్చువల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీలో లీడర్లుగా ఎదుగుతామనీ, పండుగ రోజుల్లో మెసేజ్ ల బ్లాకేజ్ ఉండదని ఆయన స్పష్టం చేశారు

#10

300 పైగా ఛాన ల్స్ లైవ్ లో చూడొచ్చని, అలాగే 28 లక్షల కాలర్ టూన్స్, 6 వేల సినిమాలు, 60 వేల మ్యూజిక్ ఉచితంగా పలు అప్లికేషన్స్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

#11

ఫైబర్ నెట్ ద్వారా దేశంలో దాదాపు కోటి వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో 2017 నాటికి 90 శాతం గ్రామాలకు తమ సేవలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో జియో పని చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write jio knows that 5g will come soon and reliance jio 4g will revolutionize
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot