రూ.16,499కే Jio ల్యాప్‌టాప్.. ఫీచర్లు, సేల్ వివరాలు..!
భారత్‌లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో మోడల్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. గత సంవత్సరం విడుదల చేసిన జియో బుక్‌కు కొనసాగింపుగా జియో బుక్ 2023ను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ వినియోగదారులకు, ప్రాథమిక స్థాయి పనులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని జియో తెలిపింది. జియో బుక్ దేశంలోనే తొలి లెర్నింగ్ బుక్‌గా సంస్థ చెబుతోంది.
జియో బుక్ 2023 లోపల అమర్చిన సిమ్ కార్డును జియో అధికారిక వెబ్‌సైట్ లేదా జియో స్టోర్‌ను సంప్రదించి యాక్టివేట్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. అయితే బడ్జెట్ రేంజ్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నట్లయితే ఇది మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

జియో బుక్ 2023 11.6 అంగుళాల యాంటీ గ్లేర్ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1366*768 రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ సన్నగా, తేలికగా ఉంటుంది. కేవలం 990 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మల్టీమీడియాలో మెరుగైన అనుభూతి కోసం స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ను అల్టిమేట్ లెర్నింగ్ పాట్నర్‌గా జియో పేర్కొంది.
జియో బుక్ 2023 మీడియోటెక్ MT8788 ప్రొసెసర్ ఆధారంగా పనిచేస్తాయి. మరియు 4GB ర్యామ్, eMMC 64GB అంతర్గత స్టోరేజీతో వస్తుంది. SD కార్డు ద్వారా 256GB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఈ జియో కొత్త ల్యాప్‌టాప్ జియోOSపై పనిచేస్తుంది.
జియో బుక్ 2023 4000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 8 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని జియో సంస్థ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్ 4G సపోర్టుతో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, రెండు USB 2.0 పోర్టులు, 3,5mm హెడ్‌ఫోన్ జాక్, మిని HDMI పోర్ట్‌ను కలిగి ఉంటుంది.
ఈ జియో ల్యాప్‌టాప్ 2 MP వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇన్ఫినిటీ కీబోర్డు, పెద్ద ట్రాక్‌పాడ్, జియో+f పుల్ స్క్రీన్ మోడ్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ జియో బుక్ 2023 ధర రూ.16499కు కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.
ఈ ధరకు అదనంగా క్విక్ హీల్ యాంటీ వైరస్ సబ్‌స్క్రిప్షన్, ల్యాప్‌టాప్ కేస్, సంవత్సరం పాటు 100GB డిజీబాక్స్ క్లౌడ్ స్టోరేజీ ఉచితంగా ఇస్తోంది. ఆగస్టు 5 నుంచి రిలయన్స్ డిజిటల్‌తోపాటు అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఈ జియో బుక్‌ను ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రీ ఆర్డర్ చేసేందుకు కొన్ని పిన్‌కోడ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు.
జియో బుక్ 2023ను ప్రీ ఆర్డర్ చేసుకొనే వారికి ఆగస్టు 5 తేదీ 12 AM గంటలకు డెలివరీలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాసులు సహా ప్రాథమిక విధుల కోసం ల్యాప్‌టాప్ అవసరమైన వారికి ఈ జియో బుక్ మంచి ఎంపిక అవుతుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








