Home
News

OTT ప్రయోజనాలతో జియో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు విడుదల.. పూర్తి వివరాలు..!

ప్రముఖ టెలికాం సంస్థ జియో ఈ నెల తొలి వారంలో రీఛార్జీ ప్లాన్‌ ధరలను పెంచింది. అయితే అనంతరం రూ.999 ప్లాన్‌ ను చిన్న మార్పులతో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు తాజాగా ఓటీటీ ప్రయోజనాలతో కూడిన రీఛార్జీ ప్లాన్‌ లను జియో లాంచ్ (Jio Recharge Plans with OTT Benefits) చేసింది. రీఛార్జీ ప్లాన్‌ లు రూ.329, రూ.949, రూ.1049 లను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ ల ప్రయోజనాల పూర్తి వివరాలు.

జియో రూ.329 రీఛార్జీ ప్లాన్‌ :
ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 1.5GB రోజువారీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. దీంతోపాటు jiosaavn pro, జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ వంటి సర్వీసులను పొందవచ్చు.

Jio prepaid Recharge plans with OTT Benefits 2024

జియో రూ.949 రీఛార్జీ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతి రోజు 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటా ను కూడా వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజులపాటు డిస్నీ + హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. వీటితోపాటు జియోటీవీ, జియోసినిమా, జియో క్లౌడ్‌ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే 5G డేటా వినియోగించుకొనేందుకు వినియోగదారుడు 5G స్మార్ట్‌ఫోన్‌ సహా 5G నెట్‌వర్క్‌ సదుపాయం అందుబాటులో ఉండాలి.

జియో రూ.1049 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMSలను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటా ను వినియోగించుకోవచ్చు. జియోటీవీ మొబైల్‌ యాప్‌ ద్వారా sonyLIV మరియు Zee5 సబ్‌స్క్రిప్ష్‌ ను పొందవచ్చు. దీంతోపాటు జియో క్లౌడ్‌, జియో సినిమా యాప్‌ లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిడెట్ 5G డేటాను పొందవచ్చు.

98 రోజుల వ్యాలిడిటీతో జియో ప్లాన్‌ :
జియో ఇటీవల రూ.999 ప్లాన్‌ను మరోసారి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా 98 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. గతంలో ఈ ప్లాన్‌ 3GB డేటాతో 84 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందించేది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
jio launched prepaid Recharge plans 2024 with ott benefits here are the list and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X