జియో నుంచి రూ.100 కే కొత్త రీఛార్జ్ ప్లాన్.. జియోహాట్‌స్టార్ OTT సహా డేటా ప్రయోజనాలు..!
జియోసినిమా, డిస్ని + హాట్‌స్టార్ ఓటీటీలు ఒకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్ గా (Jiohotstar OTT) ఇటీవల అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాట్‌ఫాం ద్వాలా లైవ్ క్రికెట్ సహా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ను వీక్షించవచ్చు. ఫలితంగా టెలికాం సంస్థలు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో (Jiohotstar Subscription Recharge Plans in Jio) అనేక రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొచ్చాయి. జియో సంస్థ కూడా ఇప్పటికే రెండు రీఛార్జ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. అయితే తాజాగా జియో నుంచి కీలక ప్రకటన వెలువడింది.
రూ.100 కే 90 రోజుల వ్యాలిడిటీ :
జియో తాజాగా రూ.100 డేటా ప్లాన్ ను (Jio Rs100 Recharge Plan) విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా 5 GB డేటాను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ లో ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది. జియో వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు.

ఇప్పటికే రెండు రీఛార్జ్ ప్లాన్లు :
ఇప్పటికే జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు రూ.195, రూ.949 లను జియో తీసుకొచ్చింది. ఈ జియో రూ.195 ప్లాన్‌లో భాగంగా మూడు నెలలపాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మొబైల్‌లో HD రిజల్యూషన్‌లో క్రికెట్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ కు అవకాశం ఉంది.
ఈ జియో రూ.195 ప్లాన్ లో (Jio Rs195 Recharge Plan) 15GB డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను పొందలేరు. వినియోగదారులు ఈ విషయాన్ని గ్రహించాలి. దీంతోపాటు జియో రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.
జియో రూ.949 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌లో (Jio Rs949 Recharge Plan) భాగంగా మూడు నెలల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ సహా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. మరియు ఈ ప్లాన్‌లో కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా లోకల్, STD అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. వీటితోపాటు రోజువారీ 2GB 4G డేటా ను అందిస్తోంది. 5G నెట్‌వర్క్, స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటే అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. కాలింగ్, డేటా, SMS ప్రయోజనాల వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
భారత టెలికాం రంగంలో జియో యూజర్ల పరంగా జియో అగ్రస్థానంలో ఉంది. భారీ స్థాయిలో ఉన్న యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. వీటిలో వివిధ ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్‌లను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు చాలా ఉన్నాయి. జియో తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఉన్నాయి.


Click it and Unblock the Notifications








