Home
News

జియో రూ.1234 రీఛార్జ్‌ ప్లాన్‌తో ఏకంగా 11 నెలల వ్యాలిడిటీ.. ఈ ప్లాన్‌ ప్రత్యేకంగా వారికోసం..!

జియో (Reliance Jio) ప్రస్తుతం దేశంలో ఎక్కువ సంఖ్యలో యూజర్లు కలిగిన టెలికాం నెట్‌వర్క్‌ గా ఉంది. భారీ సంఖ్యలో ఉన్న తన యూజర్ల కోసం అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. దీంతోపాటు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాన్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా ఆకట్టుకొనే ప్రయోజనాలతో రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన జియో.. తాజాగా మరో సూపర్‌ ప్లాన్‌ ను లాంచ్‌ చేసింది.

జియో తాజాగా రూ.1234 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ను (Jio RS1234 Recharge Plan) తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా కాలింగ్‌, డేటా, SMS ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకొనే యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు జియో యాప్‌లను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు.

Jio launched RS1234 Prepaid recharge plan for jio bharat phone users only

జియో రూ.1234 రీఛార్జ్‌ ప్లాన్‌ ప్రయోజనాలు :
జియో రూ.1234 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 500MB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతి 28 రోజులకు 300 SMS లను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.

అంటే ఈ ప్లాన్‌లో భాగంగా ఏకంగా 11 నెలలపాటు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌ కేవలం జియోభారత్‌ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని జియో తెలిపింది. కేవలం కాలింగ్ అవసరాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. దీంతోపాటు జియోసినిమా, jiosavaan వంటి యాప్‌లను వినియోగించుకోవచ్చు.

దీంతోపాటు జియోభారత్‌ ఫోన్‌ యూజర్ల కోసం రూ.234 ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా 56 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 0.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతి 28 రోజులకు 300 SMS లను పొందవచ్చు. జియోశవన్‌, జియో సినిమా, జియోటీవీ యాప్‌లను పొందవచ్చు.

జియో భారత్ ఫోన్‌ ఇతర రీఛార్జ్‌ ప్లాన్‌లు :
జియో భారత్ ఫోన్‌ల కోసం అత్యంత తక్కువ ధరలో రూ.123 రీఛార్జ్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 0.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు వ్యాలిడిటీ మొత్తంలో 300 SMS లను పొందవచ్చు. జియో సినిమా, జియోటీవీ, Jiosaavn యాప్‌లు ఉపయోగించుకోవచ్చు.

జియో గత సంవత్సరం జులై తొలివారంలో మొబైల్‌ టారిఫ్‌ ఛార్జీలను పెంచింది. ఫలితంగా జులై, ఆగ‌స్టు, సెప్టెంబర్‌, అక్టోబర్ నెలల్లో సుమారు కోటి మంది యూజర్లను కోల్పోయినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తన నివేదికల్లో వెల్లడించింది. నెలవారీ నివేదికల్లో వివరాలను విడుదల చేసింది.

ట్రాయ్ వివరాల ఆధారంగా 2024 అక్టోబర్‌ లో 37.60 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. 2024 సెప్టెంబర్‌ లో 79.70 లక్షలు, 2024 ఆగస్టులో సుమారు 40 లక్షలు, 2024 జులైలో 8 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్లు ట్రాయ్‌ నివేదిక వెల్లడించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio launched RS1234 Prepaid recharge plan for jio bharat phone users only
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X