Home
News

పేదవాడికి గుడ్ న్యూస్.. కేవలం వాయిస్, SMSలతో జియో సరికొత్త ప్లాన్స్.. వెరీ చీప్..!

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించే జియో తాజాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు కొత్త ప్లాన్లను విడుదల చేసింది. ఈ ప్లాన్స్‌ను ప్రత్యేకంగా వాయిస్ కాలింగ్, SMS సేవలను మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ చౌకైన ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది.

* జియో కొత్త ప్లాన్స్ వివరాలు

- రూ.458 ప్లాన్:

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. అలాగే ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1000 SMSలు, జియో టీవీ, జియో సినిమా (నాన్-ప్రీమియం), జియో క్లౌడ్ వంటి జియో యాప్స్‌కు ఫ్రీ యాక్సెస్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటాను తీసేసారు. ఇంతకుముందు రూ.479 ప్లాన్‌లో 6GB డేటా ఉండేది, ఇప్పుడు ఆ డేటాను తొలగించి, ధరను రూ.21 తగ్గించారు.

Jio Launches Affordable Voice  amp amp  SMS Plans

- రూ.1,958 ప్లాన్:

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 SMSలు, జియో యాప్స్‌కు ఫ్రీ యాక్సెస్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ ధర రూ.59 పెరిగింది. రూ.1,899 ప్లాన్‌లో 6GB డేటా, 336 రోజుల వ్యాలిడిటీ ఉండేది. కొత్త ప్లాన్‌లో డేటా బెనిఫిట్ తీసేశారు. కానీ అదనంగా 29 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

- నిలిపివేసిన ప్లాన్లు:

జియో ఈ ప్లాన్లను నిలిపివేసింది.

రూ.479 ప్లాన్: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1000 SMSలు, 6GB డేటా - 84 రోజులు.

రూ.1,899 ప్లాన్: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 SMSలు, 6GB డేటా - 336 రోజులు.

రూ.189 ప్లాన్: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMSలు, 2GB డేటా - 28 రోజులు.

ఇకపై జియో వాయిస్, SMS-మాత్రమే ప్లాన్లపై దృష్టి సారిస్తుంది. డేటా అవసరమైన కస్టమర్లు ప్రత్యేకంగా డేటా ప్యాక్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీ ప్రస్తుత ప్లాన్‌కు అదనంగా డేటా కోసం, ఈ కింది ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.

- డేటా బూస్టర్ ప్యాక్స్‌:

రూ.11: 10GB డేటా, 1 గంట వ్యాలిడిటీ.

రూ.19: 1GB డేటా, 24 గంటల వ్యాలిడిటీ.

రూ.29: 2GB డేటా, 2 రోజుల వ్యాలిడిటీ.

రూ.69: 6GB డేటా, మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ వరకు.

రూ 139: 12GB డేటా, మీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ వరకు.

* డేటా ఓన్లీ ప్యాక్‌లు:

రూ.49: 25GB డేటా, 1 రోజు వ్యాలిడిటీ.

రూ.175: 10GB డేటా + 10 OTT సబ్‌స్క్రిప్షన్లు, 28 రోజుల వ్యాలిడిటీ.

రూ.219: 30GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.

రూ.289: 40GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.

రూ.359: 50GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.

* జియోఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు:

రూ.26: 2GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ.

రూ.62: 6GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ.

రూ.86: 14GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ.

రూ.122: 28GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ.

రూ.182: 56GB డేటా, 28 రోజుల వ్యాలిడిటీ.

* ఎందుకీ మార్పులు?

TRAI మార్గదర్శకాలకు అనుగుణంగా, టెలికాం ఆపరేటర్లు చౌకైన వాయిస్, SMS-మాత్రమే ప్లాన్లను అందించాలని సూచించింది. దీని ప్రకారం జియో ఈ కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. యూజర్లను తమకు అవసరమైన సేవలకు మాత్రమే చెల్లించేలా ఈ ప్లాన్స్ ఉన్నాయి.

రూ.458 ప్లాన్ తక్కువ కాలానికి, తక్కువ ధరలో ప్లాన్ కోరుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. రూ.1,958 ప్లాన్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ, రోజూ కాల్స్ మాట్లాడుకునే వారికి సరిపోతుంది.

డేటా తొలగింపు కొంతమందికి నచ్చకపోయినా, కాల్స్, మెసేజ్‌లకు ప్రాధాన్యమిచ్చే వారికి, డబ్బులు ఆదా చేసుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్లు బెస్ట్ గా నిలుస్తాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, మెరుగైన అనుభవాన్ని అందించడమే జియో లక్ష్యం.

ఈ కొత్త ప్లాన్లతో, వృద్ధులు, గ్రామీణ వినియోగదారులు, డేటా లేకుండా వాయిస్, SMS సేవలను కోరుకునేవారికి జియో సరైన పరిష్కారాన్ని అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio launched new voice and SMS plans. Data is available via add-on packs. Rs 458 and Rs 1958 plans are available. Old plans have been discontinued.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X