Home
News

Jio PhoneCall Ai ని లాంచ్ చేసింది! దీనితో, #1 ని నొక్కితే కాల్ రికార్డు చేయవచ్చు. ఎలాగో చూడండి

రిలయన్స్ జియో ఈరోజు తన 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్‌కాల్ AI అనే కొత్త AI-ఆధారిత సేవలను లాంచ్ చేసింది. ఈ కొత్త AI ఫీచర్ జియో వినియోగదారుల యొక్క రోజువారీ ఫోన్ కాల్‌లలో Ai ని అనుసంధానిస్తుంది. Jio సమాచారం ప్రకారం, ఈ కొత్త AI ఫీచర్ కంపెనీ యొక్క "కనెక్ట్ ఇంటెలిజెన్స్" లో భాగంగా వస్తుంది.

ఈ ఫీచర్ Jio ఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి, ట్రాన్స్ స్క్రైబ్ మరియు ట్రాన్సలేషన్ కు వినియోగదారులను అనుమతిస్తుంది. దీని ద్వారా వివిధ భాషల్లో శోధించడం, షేర్ చేయడం మరియు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.

Jio Launches PhoneCall AI Feature  It will Allow Users To Record And Translate Calls  How Does It Work

ఈ కొత్త JioPhonecall AI తో, మీరు ఇప్పుడు AIని ఉపయోగించడం ఫోన్ నంబర్‌ను డయల్ చేసినంత సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు Jio హైలైట్ చేస్తుంది. ఈ కొత్త AI ఫీచర్‌ని ఉపయోగించడానికి, Jio ఒక ప్రత్యేకమైన ఫోన్ నంబర్‌ను అందజేస్తుంది. వినియోగదారులు మరొక పార్టిసిపెంట్‌ని జోడించినట్లే ఏ కాల్‌కైనా జోడించవచ్చు.

కొత్త JioPhonecall AI ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ వివరంగా చూద్దాం.

JioPhonecall AI ని ఎలా ఉపయోగించాలి
* Jio ఫోన్ కాల్ AI సేవలను ఉపయోగించడం ప్రారంభించడానికి, వినియోగదారులు కాల్ మాట్లాడుతున్నప్పుడు JioPhonecall AI నంబర్-1-800-732673 ని జోడించాలి. స్వాగత సందేశాన్ని విన్న తర్వాత, కాల్‌ని రికార్డ్ చేయడం మరియు ట్రాన్స్ స్క్రైబ్ ప్రారంభించడానికి వారు #1ని నొక్కవచ్చు.
* కాల్ సమయంలో, JioPhonecall AI వింటుంది మరియు అవతలి వారు మాట్లాడే పదాలను టెక్స్ట్‌గా మారుస్తుంది. పారదర్శకత కోసం, సేవ కాల్ రికార్డ్ చేయబడిందని కాలర్‌కు ప్రకటిస్తుంది.
* #2ను నొక్కడం ద్వారా ట్రాన్స్‌క్రిప్షన్‌ను పాజ్ చేయడానికి మరియు #1ని నొక్కడం ద్వారా పునఃప్రారంభించడానికి వినియోగదారులు అవకాశం కలిగి ఉంటారు. పూర్తయిన తర్వాత, వినియోగదారులు #3ని నొక్కడం ద్వారా AI ఫోన్ కాల్ ప్రక్రియను ముగించవచ్చు.
* ఈ కాల్ తర్వాత, JioPhonecall AI అన్ని రికార్డింగ్‌లు, ట్రాన్స్‌క్రిప్షన్‌లు, సారాంశాలు మరియు అనువాదాలను Jio క్లౌడ్‌లో సేవ్ చేస్తుంది. అవి ఎప్పుడైనా సురక్షితంగా మరియు యాక్సెస్ చేయగలవని నిర్ధారిస్తుంది.

JioPhonecall AI ఫీచర్ల వివరాలు
JioPhonecall AI ఫోన్ కాల్‌లను నిర్వహించడంలో మరియు సేవ్ చేయడంలో సహాయపడే అనేక లక్షణాలను కలిగి ఉంది:
కాల్ రికార్డింగ్ మరియు స్టోరేజీ: JioPhonecall AI ఆటోమేటిక్ గా Jio క్లౌడ్‌లో ఫోన్ కాల్‌లను రికార్డ్ చేస్తుంది మరియు నిల్వ చేస్తుంది. వినియోగదారులకు వారి పాత సంభాషణలను సులభంగా యాక్సెస్ చేస్తుంది.
ట్రాన్స్ స్క్రైబ్ ఫీచర్ : JioPhonecall AI వినియోగదారులను నిజ-సమయంలో టెక్స్ట్‌గా మార్చడానికి అనుమతిస్తుంది, కాల్‌ని రీప్లే చేయకుండా ముఖ్యమైన వివరాలను తిరిగి సూచించడాన్ని సులభతరం చేస్తుంది.
కాల్ సమ్మరీ: కొత్త AI సేవలు సుదీర్ఘ సంభాషణల యొక్క సమ్మరీ కూడా అనుమతిస్తుంది, ఏదైనా కాల్ యొక్క ముఖ్య అంశాలను త్వరగా అర్థం చేసుకోవడానికి వినియోగదారులకు సహాయపడుతుంది.
ట్రాన్సలేషన్(అనువాదం) ఫీచర్: JioPhonecall AI బహుళ భాషలకు మద్దతు ఇస్తుందని, వినియోగదారులు సంభాషణలను తక్షణమే అనువదించడానికి మరియు భాషా అడ్డంకులను అధిగమించడానికి వీలు కల్పిస్తుందని Jio పేర్కొంది.

Jio క్లౌడ్‌తో JioPhonecall Ai ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది
Jio వినియోగదారులు తమ ఫోన్ కాల్ రికార్డింగ్‌లు మరియు సంబంధిత డేటాను JioCloud లో నిల్వ చేసుకోవడానికి అనుమతిస్తుంది. రియల్ టైమ్ రికార్డింగ్ మరియు ట్రాన్స్‌క్రిప్షన్ కాకుండా, కాల్ రికార్డింగ్‌లు, ట్రాన్‌స్క్రిప్ట్‌లు, సారాంశాలు మరియు అనువాదాలతో సహా వినియోగదారులందరికి డేటాను జియో క్లౌడ్‌లో సురక్షితంగా స్టోర్ చేసేలా JioPhonecall AI పనిచేస్తుంది.

Jio క్లౌడ్‌తో ఈ ఏకీకరణ ద్వారా వినియోగదారులు Jio యొక్క వెల్‌కమ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇది ప్రారంభంలో 100GB ఉచిత క్లౌడ్ స్టోరేజీ గోప్యత మరియు భద్రతా లక్షణాలను అందిస్తుంది. Jio క్లౌడ్ వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ లు మరియు మరిన్ని స్టోరేజీ చేయడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి కూడా అనుమతిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Launches PhoneCall AI Feature, It will Allow Users To Record And Translate Calls. How Does It Work?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X