Home
News

మీరు ఎక్కువగా డేటాను వినియోగిస్తుంటారా.. అయితే రూ.601 రీఛార్జ్‌ ప్లాన్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి..!

జియో ప్రస్తుతం దేశంలో ఉన్న టెలికాం సంస్థల్లో యూజర్ల పరంగా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, BSNL ఉన్నాయి. అయితే ప్రైవేటు టెలికాం సంస్థలు ఈ సంవత్సరం జులై నెలలో మొబైల్‌ టారిఫ్‌ ధరలను భారీగా పెంచాయి. దీంతో ఈ సంస్థలకు యూజర్లు భారీగా షాక్‌ ఇస్తున్నారు. ఇతర నెట్‌వర్క్ లకు పోర్టింగ్ అవుతున్నారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో జియో ఏకంగా కోటికి పైగా యూజర్లను కోల్పోయింది.

దీంతో యూజర్లను కాపాడుకొనేందుకు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. జియో తాజాగా రూ.601 రీఛార్జ్‌ ప్లాన్‌ను (Jio RS601 Recharge Plan) లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ ద్వారా 12 నెలల వ్యాలిడిటీతో 12 అన్‌లిమిటెడ్‌ 5G డేటా వోచర్‌లను పొందవచ్చు.

Jio launches RS601 Data voucher

ఈ అన్‌లిమిటెడ్‌ 5G వోచర్‌లను ఇతరులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు అవకాశం కూడా ఉందని జియో చెబుతోంది. జియో యూజర్లు రూ.601 రీఛార్జ్‌ ప్లాన్‌ను (Jio RS601 Data Voucher) ఎంచుకుంటే.. మొత్తంగా 12 5G డేటా వోచర్‌లను పొందవచ్చు. ఈ వోచర్‌లను My Jio యాప్‌ ద్వారా రీడీమ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా యూజర్లు ప్రతి రోజు 3GB అదనపు 4G డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు.

జియో అందిస్తున్న 12 అన్‌లిమిటెడ్‌ 5G డేటా వోచర్‌ లను 12 నెలల్లోగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరియు ప్రతి వోచర్‌ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. అయితే యూజర్లు ఒక ముఖ్య విషయాన్ని గుర్తించుకోవాలని జియో సూచించింది. వోచర్‌ వ్యాలిడిటీ బేసిక్‌ ప్లాన్‌ వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఉదాహరణకు మీ బేసిక్‌ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటే, ఈ వోచర్ కూడా 28 రోజుల వరకు మాత్రమే పనిచేస్తుంది.

ఈ జియో రూ.601 రీఛార్జ్‌ ప్లాన్‌ ను కొనుగోలు చేసేందుకు యూజర్లు కొన్ని బేసిక్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉండాలి. రూ.199, రూ.239, రూ.319, రూ.329, రూ.579, రూ.666, రూ.766, రూ.899 ప్లాన్‌లతో రీఛార్జ్‌ చేసుకున్న యూజర్లు మాత్రమే రూ.601 రీఛార్జ్‌ చేసుకొనేందుకు అర్హులని జియో తెలిపింది.

అంటే రూ.601 అన్‌లిమిటెడ్‌ 5G డేటా వోచర్‌లను కొనుగోలు చేసేందుకు కనీసం ప్రతి రోజు 1.5GB డేటా అందించే రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉండాలి. రోజువారీ 1GB డేటా మరియు రూ.1899 రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉన్న యూజర్లు... జియో రూ.601 డేటా వోచర్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయలేరు.

ఈ ప్లాన్‌లో భాగంగా వచ్చే 12 5G డేటా వోచర్‌లను ఇతరులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే వారు కూడా పైన తెలిపిన అర్హతలను కలిగి ఉండాలి. ఈ కొత్త రూ.601 అన్‌లిమిటెడ్‌ 5G డేటా వోచర్‌తోపాటు ఇప్పటికే అనేక డేటా వోచర్‌లు జియో కలిగి ఉంది. రూ.51, రూ.101, రూ.151 రీఛార్జ్‌ ప్లాన్‌లతో డేటా వోచర్‌లను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio launches RS601 Data voucher which offers unlimited 5G data with 12 months validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X