Home
News

సెప్టెంబర్‌లోనూ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా లకు షాక్‌ ఇచ్చిన యూజర్లు..!

భారత్‌లో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా (Vi) జులై నెలలో భారీగా మొబైల్‌ టారిఫ్‌ ధరలను పెంచాయి. ఈ ప్రభావం ఆయా టెలికాం సంస్థల యూజర్ల సంఖ్యపై పడింది. జులై నుంచి భారీ సంఖ్యలో యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్‌ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను ట్రాయ్‌, టెలికాం శాఖ విడుదల చేశాయి. అయితే సెప్టెంబర్‌ నెలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జియో వరుసగా మూడు నెల కూడా భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోయింది.

సెప్టెంబర్‌లోనూ జియోకు షాక్‌ ఇచ్చిన యూజర్లు :
భారత టెలికాం మార్కెట్‌లో యూజర్ల పరంగా జియో (Jio) తొలి స్థానంలో ఉంది. అయితే రీఛార్జ్ ప్లాన్‌ ధరల పెంపు నిర్ణయంతో జులై, ఆగస్టు నెలల్లో భారీగా యూజర్లను కోల్పోగా.. తాజాగా సెప్టెంబర్‌లోనూ భారీ సంఖ్యలో వినియోగదారులను కోల్పోయింది. టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ వివరాలను వెల్లడించింది.

jio airtel vi lost users in september 2024

BSNL వరుసగా మూడు నెలలపాటు :
సెప్టెంబర్‌ నెలలో జియో ఏకంగా 79.6 లక్షల యూజర్లను కోల్పోయింది. ఎయిర్‌టెల్ 14.3 లక్షలు, వోడాఫోన్‌ ఐడియా 15.5 మిలియన్‌ల యూజర్లను కోల్పోయింది. అదే సమయంలో 8.4 లక్షల మంది యూజర్ల BSNL నెట్‌వర్క్‌లో కొత్తగా చేరారు. వరుసగా మూడు నెలలపాటు భారీ సంఖ్యలో యూజర్లను BSNL సంపాదించుకుంది.

సుమారు 79.6 లక్షల మంది యూజర్లు :
ట్రాయ్‌ వివరాల ఆధారంగా జులై నెలలో మొబైల్‌ టారిఫ్‌ ధరల ఛార్జీలు పెంపు అనంతరం జియో భారీగా యూజర్లను కోల్పోయింది. జులై నెలలో 7.5 లక్షలు, ఆగస్టు నెలలో 40.1 లక్షలు, అదే సెప్టెంబర్‌లో ఏకంగా 79.6 లక్షల మంది వినియోగదారులు జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు.

అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL (భారత్ సంచార్‌ నిగమ్ లిమిటెడ్‌) కు కొత్తగా యూజర్లు వచ్చి చేరుతున్నారు. జులై నెలలో 29.2 లక్షలు, ఆగస్టులో 24.3 లక్షలు, సెప్టెంబర్‌లో 8.4 లక్షలు యూజర్ల BSNL నెట్‌వర్క్‌లో చేరారు. తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉండడం సహా త్వరలో పూర్తిస్థాయిలో 4G అందుబాటులో వచ్చే అవకాశం ఉండడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.

40.20 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో జియో :
ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30 నాటికి జియో సుమారు 46.37 కోట్ల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. ఎయిర్‌టెల్‌ 38.34 కోట్లు, వోడాఫోన్ ఐడియా (Vi) 21.24 కోట్ల యూజర్లను కలిగి ఉంది. అదే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL 9.38 కోట్ల యూజర్లను కలిగి ఉంది. జియో 40.20 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉంది.

సుమారు అన్ని సర్కిల్స్‌లోనూ :
ఎయిర్‌టెల్‌ 33.24 శాతం వాటాను కలిగి ఉంది. మరో ప్రైవేటు టెలికాం సం‌స్థ వోడాఫోన్‌ ఐడియా 18.41 శాతం మరియు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL/MTNL మొత్తంగా 8.15 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా సుమారు అన్ని టెలికాం సర్కిల్స్‌లో యూజర్లను కోల్పోయింది.

Best Mobiles in India

English summary
jio lost 79.6 lakh users in september due to tariffs impact but bsnl gains full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X