Home
News

జియో నెట్‌వర్క్ డౌన్ అయినట్లు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌!! మీకు సమస్య ఉందా?

ఫేస్‌బుక్ నెట్‌వర్క్ కొన్ని రోజుల క్రితం డౌన్‌టైమ్‌ను ఎదుర్కొన్న సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ వంటి ప్రధాన సోషల్ మీడియా సంస్థల యొక్క అన్ని రకాల సేవలు కొన్ని గంటల తరబడి నిలిచిపోయాయి. అదే విధంగా ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్‌గా పేరు పొందిన రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు JioDown అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమ యొక్క సమస్యలను ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

JioDown

JioDown అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ ఇండియాలో ట్రెండ్ అవుతోంది. ఇక్కడ చాలా మంది వినియోగదారులు తమ Jio SIM కార్డులు పనిచేయడం లేదని ట్విట్టర్ లో నివేదించారు. చాలా మంది వినియోగదారులు తమ ప్రియమైన వారికి ఫోన్ కాల్‌లను చేయలేక పోవడమే కాకుండా ఇంటర్నెట్‌ యొక్క అన్ని రకాల సేవలను వినియోగించలేక పోతున్నట్లు సమాచారం ఇచ్చారు. దేశవ్యాప్తంగా జియో నెట్‌వర్క్‌లో కొంత సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది వినియోగదారులను ఆగ్రహానికి గురి చేసింది.

అయితే నేను ఉపయోగిస్తున్న జియో సిమ్ కార్డ్‌తో నేను ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదు. నేను ఎలాంటి ఆటంకం లేకుండా ముందు మాదిరిగానే ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వగలను మరియు నాకు నచ్చిన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్స్ చేయగలుగుతున్నాను. ఇటీవలి అప్‌డేట్ ప్రకారం జియో నెట్‌వర్క్ లోపభూయిష్టంగా ఉన్నట్లు ఫిర్యాదు చేసిన వారిలో దాదాపుగా 2,000 మంది వినియోగదారులు ఉన్నట్లు సమాచారం.

సమస్య ఏమిటి?

సమస్య ఏమిటి?

ఇప్పటి వరకు ఈ సమస్యకు సంబంధించి జియో నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కొన్ని ప్రదేశాలలో నెట్‌వర్క్ పనిచేస్తున్నందున జియో నెట్‌వర్క్ సమస్య దేశంలోని కొన్ని సర్కిళ్లకు మాత్రమే పరిమితం కావచ్చు మరియు జియో ఈ సమస్యను ఏ సమయంలోనైనా పరిష్కరించాలి.

ఎయిర్‌టెల్ మరియు Vi నుండి సేవలను యాక్సెస్ చేస్తున్నప్పుడు కొంతమంది వినియోగదారులు తమకు ఎలాంటి సమస్య లేదని నివేదించడం కూడా ఆసక్తికరంగా ఉంది. దీని అర్థం ఎంచుకున్న సర్కిల్‌లలో నెట్‌వర్క్ తప్పనిసరిగా కొన్ని సమస్యలను ఎదుర్కొంది. మరియు దానికి సంబంధించి అధికారిక నిర్ధారణ కోసం మేము ఇంకా వేచి ఉన్నాము.

 

ఇంతలో మీరు ఏమి చేయవచ్చు?

మీరు Jio SIM కలిగి ఉండి ఇంటర్నెట్ యాక్సెస్ చేయలేకపోతే లేదా కాల్‌లు చేయలేకపోతే కనుక మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇది చాలా ఖచ్చితమైన పరిష్కారం కానప్పటికీ మీ పరికరం కలిగి ఉన్న ఏదైనా సమస్యను ఇది పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. అయితే ఇది మీ సమస్యను పరిష్కరించకపోతే మీరు వైఫై నెట్‌వర్క్ లేదా ఇతర నెట్‌వర్క్ ప్రొవైడర్‌ల నుండి ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికీ ఇంటి నుండి పని చేస్తున్న చాలా మంది వైఫై హాట్‌స్పాట్ కోసం తమ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవి ఇలాంటి సమస్యలను చాలానే సృష్టిస్తాయి.

JioBook ల్యాప్‌టాప్ & జియోఫోన్ నెక్స్ట్

JioBook ల్యాప్‌టాప్ & జియోఫోన్ నెక్స్ట్

JioBook ల్యాప్‌టాప్ ఇండియా లాంచ్ త్వరలో జరుగుతుందని భావిస్తున్నారు. జియో యొక్క ఈ కొత్త ప్రొడెక్టు ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది. Jio నుంచి రాబోయే ఈ ల్యాప్‌టాప్ యొక్క మూడు వేరియంట్లు సర్టిఫికేషన్ సైట్‌లో జాబితా చేయబడ్డాయి. అంతర్గత మోడల్ హోదాలు కాకుండా నోట్‌బుక్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే మునుపటి నివేదికలు JioBook 4G LTE కనెక్టివిటీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4GB LPDDR4x ర్యామ్ మరియు 64GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రావచ్చని సూచిస్తున్నాయి. జియోబుక్ ప్రారంభ తేదీ గురించి ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు తెలియదు. అలాగే జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ కూడా ఇండియాలో కొన్ని వారాల వ్యవధిలో లాంచ్ కానుంది. రిలయన్స్ జియో యొక్క ఇతర ప్రొడక్ట్‌ల మాదిరిగానే ఇది కూడా భారతదేశంలో చాలా అంచనాలతో లాంచ్ కానున్నది. జియోఫోన్ కోసం ప్రత్యేకమైన ప్లాన్లు ఉన్నట్లే జియోఫోన్ నెక్స్ట్ కోసం జియో ప్రత్యేక టారిఫ్‌లను ప్రారంభించినట్లయితే కనుక అది కంపెనీ మరియు జియో టెలికాం పరిశ్రమపై భారీ ప్రభావాన్ని చూపగలదు.

Best Mobiles in India

English summary
Jio Many Users Reporting That Jio Network is Down Through Online! Do You Have a Problem?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X