జియో గిగాఫైబర్ అప్‌డేట్, ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న యూజర్ ట్వీట్
దేశీయ టెలికాం రంగంలో సవాల్ విసురుతున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. గిగాఫైబర్‌తో బ్రాండ్‌బ్యాండ్ విభాగంలో సత్తా చాటేందుకు శరవేగంగా ముందుకు దూసుకువస్తోంది. కంపెనీ నెలకు రూ.600లతో గిగాఫైబ
దేశీయ టెలికాం రంగంలో సవాల్ విసురుతున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. గిగాఫైబర్‌తో బ్రాండ్‌బ్యాండ్ విభాగంలో సత్తా చాటేందుకు శరవేగంగా ముందుకు దూసుకువస్తోంది. కంపెనీ నెలకు రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంటోంది.

గిగాఫైబర్ కింద బ్రాండ్‌బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్‌లైన్ సేవలన్నింటినీ అందించొచ్చని తెలిపింది. అయితే ఈ న్యూస్ హాట్ హాట్ గా యూజర్లను అలరిస్తుంటే ఇప్పుడు మరో న్యూస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. అదేంటో చూద్దాం.

ల్యాండ్‌లైన్ సేవలను
దేశవ్యాప్తంగా గిగాఫైబర్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న జియో.. దానికి అనుబంధంగా ల్యాండ్‌లైన్ సేవలను కూడా అందించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో అపరిమిత కాల్స్‌ను ఉచితంగా చేసుకునే వెసులుబాటును కల్పించనున్నట్టు సమాచారం.

ప్రెషిత్ డియోరుఖ్‌కర్ ట్వీట్
జియో గిగాఫైబర్ యూజర్ ప్రెషిత్ డియోరుఖ్‌కర్ ట్వీట్ ప్రకారం.. జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ యూజర్లకు ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఇస్తున్నట్టు తెలిపారు. గిగాఫైబర్ యూజర్ల ఆవరణలో ఇప్పటికే అమర్చిన గిగాహబ్ హోం గేట్‌వే ద్వారా ఈ కనెక్షన్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

గిగాఫైబర్ యూజర్లకు
ఈ గేట్‌వే ద్వారా జియో హోం టీవీ సేవలు కూడా లభిస్తాయి. గిగాఫైబర్ యూజర్లకు ల్యాండ్‌లైన్ ఆఫర్ చేస్తున్న జియో.. యూజర్లు టెలిఫోన్ ఇన్‌స్ట్రుమెంట్‌ను కొనుక్కుని సిద్ధం చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇస్తున్నట్టు ప్రెషిత్ తెలిపారు.

ఎనిమిది అంకెల డిజిట్ నంబర్
యూజర్ తెలిపిన ట్వీట్ ప్రకారం కంపెనీ గిగా ఫైబర్ కోసం ఎనిమిది అంకెల డిజిట్ నంబరును కేటాయిస్తోంది. ఈ నంబరు ముందుగా మూడుతో ప్రారంభం కానుంది.అయితే, విషయాన్ని జియో ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

కాంబోప్లాన్‌తో
తాజా సమాచారం ప్రకారం.. జియో గిగాఫైబర్‌ను కాంబోప్లాన్‌తో అందించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. రూ.600 కనీస మొత్తంతో బ్రాడ్‌బ్యాండ్, టీవీ, ల్యాండ్‌లైన్ సర్వీసులను అందించబోతున్నట్టు సమాచారం.

ట్రిపుల్ ప్లే ప్లాన్
ఈ ట్రిపుల్ ప్లే ప్లాన్‌ను ఇప్పటికే తమ ఉద్యోగుల మధ్య పరీక్షిస్తోంది. కాగా, జియో ల్యాండ్‌లైన్ సర్వీసులను ప్రస్తుతం తమ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందిస్తోందని, ఇప్పటికిప్పుడు అయితే అందరికీ కాదని తెలుస్తోంది.

నెలకు 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడ్
కంపెనీ ఇప్పటికే గిగాఫైబర్ సేవలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. న్యూఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది. ఉచితంగానే నెలకు 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్ చేస్తోంది. ఈ సేవలు పొందాలంటే రూటర్ కోసం రూ.4,500 వన్‌టైమ్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. కాగా రిలయన్స్ జియో తన గిగాఫైబర్ సర్వీస్‌ను 2018 ఆగస్ట్‌లోనే ప్రకటించింది.


Click it and Unblock the Notifications








