జియో 'నవరాత్రి ఆఫర్' నిజామా లేక అబద్దమా...?
ఈ మధ్య కాలంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారులకు చాలా ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెల్సిందే.
ఈ మధ్య కాలంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారులకు చాలా ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెల్సిందే.అయితే దసరా పండగా వస్తుండడంతో మరి కొన్ని ప్లాన్లను జియో విడుదల చేస్తుందేమో అని యూజర్లు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో వినియోగదారులను నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి ప్లాన్ లను జియో సంస్థ విడుదల చేయలేదు.కాగా తాజాగా జియో నవరాత్రి ఆఫర్ పేరిట కొన్ని ప్లాన్లను జియో సంస్థ విడుదల చేసినట్టు వార్తలు వస్తున్నాయి.అయితే జియో సంస్థ మాత్రం వాటిని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. జియో సంస్థ దసరా సందర్బంగా ఎటువంటి ఆఫర్లను ప్రకటించినప్పటికీ ఇప్పటికీ చాలా లాభదాయకమైన ప్లాన్స్ ఉన్నాయి. ఈ శీర్షిక లో భాగంగా జియో ఇటీవల విడుదల చేసిన రూ.300 లోపు ప్లాన్లను మీకు అందిస్తున్నాము.ఓ లుక్కేయండి

రూ.19 సాచెట్ ప్యాక్ ...
రూ.19 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న వినియోగదారుడికి అపరిమిత వాయిస్ కాల్స్, 20 SMS,150MB డేటా, లభిస్తాయి. రోజువారి కోటా పూర్తయిన తరువాత నుంచి స్పీడ్ క్యాప్ 64Kbpsకు పడిపోతుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 1 రోజు మాత్రమే .

రూ.52 సాచెట్ ప్యాక్ ...
రూ.52 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న వినియోగదారుడికి అపరిమిత వాయిస్ కాల్స్, 70 SMS,1.5జీబీ డేటా లభిస్తాయి. రోజువారి కోటా పూర్తయిన తరువాత నుంచి స్పీడ్ క్యాప్ 64Kbpsకు పడిపోతుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులు మాత్రమే .

రూ.98 అత్యంత సరసమైన ప్లాన్...
రూ.98 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న వినియోగదారుడికి అపరిమిత వాయిస్ కాల్స్, 300 SMS,2జీబీ డేటా లభిస్తాయి. రోజువారి కోటా పూర్తయిన తరువాత నుంచి స్పీడ్ క్యాప్ 64Kbpsకు పడిపోతుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్...
రూ.149 ప్లాన్ రీఛార్జి చేయించుకున్న వినియోగదారుడికి అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకి 100 SMS, 45జీబీ డేటా లభిస్తుంది . రోజువారి కోటా పూర్తయిన తరువాత నుంచి స్పీడ్ క్యాప్ 64Kbpsకు పడిపోతుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే .


Click it and Unblock the Notifications








