జియో ప్లాన్లు, రోజుకు 5జిబి, 3జిబి, 2జిబి,1.5జిబి,1జిబి డేటా ప్లాన్ల మొత్తం లిస్ట్ ఇదే !

By Hazarath
|

దేశీయ టెలికా రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో టారిప్ వార్ రోజు రొజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలన్నీ తమ యూజర్లను కాపాడుకునేందుకు భారీ తగ్గింపుతో ధరలతో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జియో అన్నింటికంటే ముందు వరసలో నిలిచింది. జియో నుంచి దాదాపు అన్ని రకాల ప్లాన్లు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా జియో వినియోగదారులకు రోజుకు 5జిబి, 3జిబి, 2జిబి.1.5జిబి, 1జిబి డేటా అందిచే ప్లాన్ల వివరాలను మీ ముందుకు తెస్తున్నాం. ఈ ప్లాన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

బడ్జెట్ ఫోన్లలో ఆల్‌రౌండర్ హానర్ 9 లైట్బడ్జెట్ ఫోన్లలో ఆల్‌రౌండర్ హానర్ 9 లైట్

రోజుకు 1జిబి డేటా ప్లాన్

రోజుకు 1జిబి డేటా ప్లాన్

రోజుకు 1జిబి డేటాను అందించే ప్లాన్లు వరసగా రూ.149, రూ.349, రూ. 399రూ.449 ఉన్నాయి. ఇవి రోజుకు 1జిబి డేటా చొప్పున అపరిమిత కాల్స్ తో వినియోగదారులను అలరిస్తున్నాయి.
రూ.149 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా, అపరిమిత కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ
రూ.349 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా, అపరిమిత కాల్స్, 70 రోజుల వ్యాలిడిటీ
రూ.399 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా, అపరిమిత కాల్స్, 84 రోజుల వ్యాలిడిటీ
రూ.449 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా, అపరిమిత కాల్స్, 91 రోజుల వ్యాలిడిటీ

 రోజుకు 1.5జిబి డేటా ప్లాన్

రోజుకు 1.5జిబి డేటా ప్లాన్

రూ.198 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ
రూ.398 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, 70 రోజుల వ్యాలిడిటీ
రూ.448 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, 84 రోజుల వ్యాలిడిటీ
రూ.498 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, 91 రోజుల వ్యాలిడిటీ

రోజుకు 2జిబి డేటా ప్లాన్
 

రోజుకు 2జిబి డేటా ప్లాన్

రూ.299 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జిబి డేటా, అపరిమిత కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ
రోజుకు 3జిబి డేటా ప్లాన్
రూ.509 తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3జిబి డేటా, అపరిమిత కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ
రోజుకు 5జిబి డేటా ప్లాన్
రూ.799తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 5జిబి డేటా, అపరిమిత కాల్స్, 28రోజుల వ్యాలిడిటీ

ఎలా రీచార్జ్ చేసుకోవాలి

ఎలా రీచార్జ్ చేసుకోవాలి

మై జియో యాప్ పేజీలోకి వెళ్లాలి.
మీరు జియో సిమ్ వాడుతున్నట్లయితే ఆటోమేటిగ్గా జియో పేజీ లాగిన్ అవుతుంది.
అక్కడ మీకు కనిపించే రీఛార్జ్ సెక్షన్ లోకి వెళ్లాలి.
అందులో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోవాలి.
అక్కడ కనిపించే పేమెంట్ ఆప్సన్ మీద క్లిక్ చేయాలి.
అక్కడ మీకు అన్ని రకాల బ్యాకింగ్ ఆప్సన్లు కనిపిస్తాయి.
CC/ DC/ Netbanking, UPI, Paytm, JioMoney వీటిల్లో మీకు నచ్చిన దానిలోనుంచి పేమెంట్ చేయవచ్చు.

ఫోన్ యూజ‌ర్ల‌కు ఫేస్‌బుక్ యాప్

ఫోన్ యూజ‌ర్ల‌కు ఫేస్‌బుక్ యాప్

జియో ఫోన్ యూజ‌ర్ల‌కు ఫేస్‌బుక్ యాప్ తాజాగా అందుబాటులోకి వ‌చ్చింది. ఈ యాప్‌ను యూజ‌ర్లు జియో ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీంతో వారు జియో ఫోన్‌లోనూ ఫేస్‌బుక్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇప్ప‌టికే జియో ఫోన్‌కు గాను గూగుల్ అసిస్టెంట్ యాప్ ల‌భిస్తుండ‌గా ఆ జాబితాలోకి ఫేస్‌బుక్ యాప్ వచ్చి చేరింది. జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌లో ఉండే కాయ్ ఓఎస్ ఆధారంగా ఈ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఇక ఈ యాప్‌లో సాధార‌ణ ఫేస్‌బుక్ యాప్‌లో మాదిరిగానే యూజ‌ర్ల‌కు సేవ‌లు ల‌భిస్తాయ‌ని ఫేస్‌బుక్ ప్ర‌తినిధి ఒక‌రు చెప్పారు. మరి దీన్ని ఎలా పొందాలనేదానిపై ఓ లుక్కేయండి.

Facebook installation

Facebook installation

మీ జియో ఫోన్ కి డేటా కనెక్షన్ ఉండేలా సెట్ చేసుకోండి. ఆ తర్వాత మై జియో యాప్ ఓపెన్ చేస్తే అందులో మీకు Facebook installation అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మై జియో యాప్ నుండి దీన్ని allow చేయాలా అని అడుగుతుంది. దాన్ని ఒకే చేసి లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి. అది విజయవంతంగా ఇన్ స్టాల్ అయిన తరువాత మీ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసి Facebook సేవలను పొందవచ్చు.

జియో ఫోన్ ఫీచర్లు

జియో ఫోన్ ఫీచర్లు

జియో ఫోన్ ఇండియాను ఓ ఊపు ఊపిన సంగతి అందరికీ తెలిసిందే దీని ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి. 2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో

ఆఫ్‌లైన్ మార్కెట్లోకి ..

ఆఫ్‌లైన్ మార్కెట్లోకి ..

కాగా ఇప్పుడు ఇది ఆఫ్‌లైన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో, మొబైల్‌ వాలెట్‌ మొబిక్విక్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో తమ ప్లాట్‌ఫామ్‌పై జియోఫోన్‌ను విక్రయించనున్నట్టు మొబిక్విక్‌ ప్రకటించింది. జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి మొబైల్‌ వాలెట్‌ మాదే కావడం మేము చాలా గర్వంగా భావిస్తున్నామని మొబిక్విక్ తెలిపింది.

నాలుగు స్టెప్పుల్లో..

నాలుగు స్టెప్పుల్లో..

జియో ఫోన్ కావాల్సిన వారు నాలుగు స్టెప్పుల్లో దీన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. బిక్విక్‌ కస్టమర్లు హోమ్‌ పేజీలో రీఛార్జ్‌ ఐకాన్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం ''రీఛార్జ్‌ అండ్‌ బిల్‌ పేమెంట్‌'' కేటగిరీలో ఉన్న ఫోన్‌ బుకింగ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేయాలి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు జియోఫోన్‌ను ఎంపిక చేసుకోని, అవసరమైన వివరాలు నమోదుచేయాలి.

తెలుగుతోపాటు 22 ప్రాంతీయ భాషలకు..

తెలుగుతోపాటు 22 ప్రాంతీయ భాషలకు..

గతేడాది జూలైలో రిలయన్స్‌ ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 500 మిలియన్‌ మంది ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకు డిజిటల్‌ లైఫ్‌ ఆఫర్‌ చేయడానికి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. తెలుగుతోపాటు 22 ప్రాంతీయ భాషలకు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తోంది.

పలు ఆఫర్లను..

పలు ఆఫర్లను..

కాగా రిలయన్స్ జియో ఈ ఫోన్ కొన్నవారికి పలు ఆఫర్లను ప్రకటించింది. రూ.49 ప్లాన్‌ జియోఫోన్‌ యూజర్లకు కొత్త ప్రీ-పెయిడ్‌ టారిఫ్‌ ప్లాన్‌ను జియో ప్రకటించింది. ఉచిత వాయిస్‌ కాల్స్‌, 1జీబీ 4జీ డేటాతో సరికొత్తగా రూ.49 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల పాటు ఈ టారిఫ్‌ ప్లాన్‌ వాలిడ్‌లో ఉంటుందని జియో తెలిపింది.

ఇంతకు ముందు..

ఇంతకు ముందు..

ఇంతకు ముందు జియోఫోన్‌ రూ.153 ప్లాన్‌తో తొలుత ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్లాన్‌లో ఉచిత వాయిస్‌, అపరిమిత డేటా, జియో యాప్స్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇప్పుడు ఈ ఫ్లాన్ నుంచి జియో రూ.49తో ముందుకు దూసుకువచ్చింది.

మూడేళ్ల తరువాత ..

మూడేళ్ల తరువాత ..

కాగా మూడేళ్ల తరువాత ఇప్పుడు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేసే విధంగా జియో తన ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా ఈ ఫోన్ కేవలం నలుపురంగులో మాత్రమే లభిస్తోంది. ఈ ఫోన్ లో దాదాపు 23 రకాల భాషలు ఉన్నాయి. మీకు నచ్చిన భాషని ఎంపిక చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.జియో ఫోన్ లో మైజియో, మ్యూజిక్, సినిమా, జియో టివి, జియో మని, జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ లాంటి ఫ్రీ లోడెడ్ యాప్స్ ఉన్నాయి. వీటిని మీరు సపరేట్ గా డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. ఇందులో ఓ ఎమర్జెన్సీ బటన్ ఉంది. మీరు జియో ఫోన్ నుంచి 5 బటన్ ట్యాప్ చేయడం ద్వారా 100, 108లాంటి వాటికి కాల్ వెళుతుంది.

Best Mobiles in India

English summary
Jio New Plans 2018: Get Upto 5GB Data Per Day More News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X