Home
News

జియో నుంచి కొత్త ప్లాన్‌.. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, 800 టీవీ ఛానళ్లు, 15కు పైగా OTT లను వినియోగించుకోవచ్చు..!

ప్రముఖ టెలికాం సంస్థ జియో కొత్తగా పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. జియో ఫైబర్, జియో ఎయిర్‌ ఫైబర్‌ వినియోగదారులు సహా ఇతరులకు అనుకూలంగా ఉండేలా ప్లాన్‌ను జియో లాంచ్ చేసింది. ఈ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ ధర రూ.888 గా ఉంది. ఈ ప్లాన్‌ ద్వారా డేటా, ఓటీటీ, డిజిటల్‌ టీవీ ప్రసారాలను పొందవచ్చు.

జియో రూ.888 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ (Jio RS888 postpaid plan) ద్వారా 30Mbps వేగంతో డేటాను పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్ బేసిక్‌ ప్లాన్‌, అమెజాన్‌ ప్రైమ్‌ మరియు జియో సినిమా ప్రీమియం సహా 15 OTT లను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇతర ప్లాన్‌లు వినియోగిస్తున్న వారు కూడా ఈ కొత్త ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ కావచ్చు.

jio launches new RS888 postpaid plan

ఈ ప్లాన్ ద్వారా సినిమాలు, టీవీ షోలు, డాక్యుమెంటరీలు, వెబ్‌సిరీస్‌ల కంటెంట్‌ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఇటీవల IPL కోసం తీసుకొచ్చిన జియో ఐపీఎల్‌ ధన్‌ ధనా ధన్‌ ప్రయోజనాలు కూడా ఈ కొత్త ప్లాన్‌ ద్వారా పొందవచ్చు. అర్హత కలిగిన వినియోగదారులు జియో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌పై 50 రోజులపాటు క్రెడిట్‌ వోచర్‌ను పొందవచ్చు.

ఈ జియో రూ.888 పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ ద్వారా 800 డిజిటల్‌ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం మే 31 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో వెల్లడించింది. సింగిల్ ప్లాన్‌ ద్వారా డేటా, డిజిటల్‌ ఛానళ్లు, ఓటీటీ ప్రయోజనాలను పొందాలని భావిస్తున్న వారికి ఈ ప్లాన్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

** జియో గత నెలలో జియో సినిమా యాప్‌ యాడ్‌ ఫ్రీ సహా 4k నాణ్యతతో వీడియోలను వీక్షించేందుకు రూ.28, రూ.89 రెండు ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సిరిస్‌లు, సినిమాలు, చిన్నారుల ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలను వీక్షించవచ్చు. మరియు ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్‌ను వీక్షించవచ్చు.

దీంతోపాటు రూ.89 ఫ్యామిలీ ప్లాన్‌ ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకేసారి నాలుగు డివైజ్‌ లలో జియో సినిమా యాప్‌ ద్వారా కంటెంట్‌ను చూడవచ్చు. జియో ప్రీమియం వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుం లేకుండా ఈ ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ కావచ్చు.

మరికొన్ని జియో రీఛార్జీ ప్లాన్ల వివరాలు..
జియో రూ.148 రీఛార్జీ ప్లాన్‌ ద్వారా 28 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 10GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 12 OTT ప్లాట్‌ఫాంల యాక్సెస్‌ను పొందవచ్చు. జియో సినిమా ప్రీమియం, సోనీ LIV, Zee5, Sun NXT మరియు డిస్కవరీ+ సహా మరిన్ని ఓటీటీలను వినియోగించుకోవచ్చు.

జియో రూ.389 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ మరియు డేటా ప్రయోజనాలను పొందవచ్చు. రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియో సినిమా ప్రీమియం సహా 12 OTT ప్లాట్‌ఫాం లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు వినియోగదారులు 6GB 4G డేటాను అదనంగా పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

జియో రూ.1198 ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. రోజువారీ 2GB చొప్పున 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G సహా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు 12 OTT ప్లాట్‌ఫాంలను వినియోగించుకోవచ్చు. ప్రైమ్‌ వీడియో మొబైల్‌ వెర్షన్‌ సహా డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు.

దీంతోపాటు జియో రూ.4498 ప్లాన్‌ ద్వారా సంవత్సరం పాటు ప్రయోజనాలను పొందవచ్చు. రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 78GB అదనపు డేటాను పొందుతారు. మరియు 14 OTT ప్లాట్‌ఫాం లను వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio New RS888 postpaid plan with OTT TV and internet benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X