జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. రూ.77 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ..!
జియో దేశ టెలికాం రంగంలో యూజర్ల పరంగా తొలి స్థానంలో ఉంది. ఏకంగా 50 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన వార్షికోత్సవం సందర్భంగా జియో (Jio) వెల్లడించింది. వార్షికోత్సవం సందర్భంగా అనేక ఆఫర్లను ప్రకటన చేసింది. అయితే భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం జియో అనేక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది.
జియో ఇప్పటికే అనేక డేటా ప్యాక్ లను కలిగి ఉంది. ఇందులో కొన్ని రీఛార్జ్ ప్లాన్ లలో డేటా ప్రయోజనాలతోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లను కూడా అందిస్తోంది. అయితే తాజాగా జియో రూ.77 తో డేటా ప్యాక్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లోనూ డేటాతోపాటు ఓటీటీ ప్రయోజనాలను అందిస్తోంది.

* జియో రూ.77 డేటా ప్యాక్ :
ఈ ప్లాన్ లో భాగంగా (Jio Rs77 Recharge Plan) జియో యూజర్లు 3GB 4G డేటాను పొందుతారు. ఈ డేటా వ్యాలిడిటీ 5 రోజులుగా ఉంటుంది. దీంతోపాటు SonyLIV సబ్‌స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు. ఓటీటీ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని జియో తెలిపింది.
తక్కువ ధరలో డేటాతోపాటు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్ ను కావాలని భావించే యూజర్లు ఈ రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియో వెబ్‌సైట్ తో అందుబాటులో ఉంది. జియో ఇప్పటికే అనేక డేటా ప్యాక్స్ ను అందిస్తోంది.
* రూ.100 డేటా ప్యాక్ :
ఈ డేటా ప్యాక్ ను (jio Rs100 Recharge plan) ఎంచుకున్న యూజర్లు 5GB 4G డేటాను పొందుతారు. దీంతోపాటు జియోహాట్‌స్టార్ మొబైల్/TV సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఈ డేటా ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
* రూ.175 రీఛార్జ్ ప్లాన్ :
ఈ డేటా ప్యాక్ లో (Jio Rs175 Recharge Plan) భాగంగా యూజర్లు 10GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా సోనిలివ్, Zee5, డిస్కవరీ+, Sun NXT, జియో టీవీ, ప్లానెట్ మరాఠీ సహా మరిన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.
* రూ.195 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Jio Rs195 Recharge Plan) భాగంగా జియో యూజర్లు 15GB 4G డేటాను అందిస్తోంది. దీంతోపాటు జియోహాట్‌స్టార్ మొబైల్/TV సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది.
* రూ.139 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Jio Rs139 Recharge Plan) భాగంగా జియో ప్రీపెయిడ్ యూజర్లు 12GB 4G డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో కాలింగ్, SMS వంటి ఎటువంటి అదనపు ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంటుందని జియో తెలిపింది.


Click it and Unblock the Notifications








