డైరీ మిల్క్ చాక్లేట్ తినండి..1జిబి జియో డేటాను ఉచితంగా పొందండి
ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో యూజర్ల మనసులను కొల్లగొడుతున్న జియో తాజాగా మరో ఆఫర్ ను ప్రకటించింది .
ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో యూజర్ల మనసులను కొల్లగొడుతున్న జియో తాజాగా మరో ఆఫర్ ను ప్రకటించింది .ఈ ఆఫర్ కోసమై యూజర్ ఎలాంటి రీఛార్జిలు చేసుకోవాల్సిన అవసరం లేదు ,చేయాల్సిన పని అంత ఎప్పుడు తినే విధంగా Cadbury dairy milk చాక్లెట్ కొనుక్కుని తింటే చాలు జియో సంస్థ యూజర్ కు ఉచితంగా 1GB మొబైల్ డేటాను అందిస్తుంది.అది ఎలాగో తెలుసుకోండి.

దీనికి సంబంధించి My Jio అప్లికేషన్ లో....
దీనికి సంబంధించి My Jio అప్లికేషన్ లో కూడా బ్యానర్ రూపంలో రిలయన్స్ జియో చూపించడం మొదలు పెట్టింది. మీరు చేయవలసిందల్లా Cadbury dairy milk చాక్లెట్ కొనుగోలు చేసి, మీ ఫోన్‌లో ఆ ఆఫర్ అడ్వటైజ్మెంట్ క్లిక్ చేసి, Participate Now అనే బటన్ క్లిక్ చేస్తే చాలు .

చాక్లెట్ రేపర్ మీద ఉన్న బార్ కోడ్‌ని....
ఆ తర్వాత మీరు కొనుగోలు చేసిన చాక్లెట్ రేపర్ మీద ఉన్న బార్ కోడ్‌ని ఫోటో తీసి అప్లోడ్ చేయండి. దాంతో మీరు 1GBకి పొందగలుగుతారు.

మీకు లభించిన 1GB అదనపు మొబైల్ డేటాను....
అయితే ఇక్కడ మీకు లభించిన 1GB అదనపు మొబైల్ డేటాను గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న Pratham Foundation అనే సంస్థకు డొనేట్ చేసే అవకాశం కూడా Jio అందిస్తోంది. మీరలా చేయదలుచుకుంటే Donate Now అనే బటన్ ప్రెస్ చేయొచ్చు. లేదా మీకు మీరు వాడుకోవాలంటే, Keep 1 GB అనే బటన్ ప్రెస్ చేయండి.

మొబైల్ డేటా మీ అకౌంట్లో జతచేయబడుతుంది....
ఏడు నుండి ఎనిమిది రోజుల్లోపు మీకు 1 GB మొబైల్ డేటా మీ అకౌంట్లో జతచేయబడుతుంది. అయితే ఒక మొబైల్ నెంబర్ మీద ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ ఆఫర్ సెప్టెంబర్ 30న....
జియో అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్ సెప్టెంబర్ 30న ముగుస్తుంది.

జియో సెలబ్రేషన్ ప్యాక్....
2016 సెప్టెంబరులో రిలయన్స్ జియో తన 4G సర్వీసును ప్రారంభించింది. ఇప్పుడు టెలికాం ఆపరేటర్ దాని 2 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. వేడుకల్లో భాగంగా, జీయో యూజర్ల కోసం పూర్తిస్థాయి డేటా ప్యాక్ ను విడుదల చేసింది . ఇది Jio Celebrations Pack పేరుతో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 11న ఈ ఆఫర్ ముగుస్తుంది.

2 జిబి 4g డేటా....
ఈ సెలబ్రేషన్ ప్యాక్ ఆఫర్ తో యూజర్ ఆఫర్ ముగిసేంత వరకు రోజుకి 2 జిబి 4g డేటాను పొందుతాడు.


Click it and Unblock the Notifications








