మళ్లీ దుమ్మురేపిన జియో, భారీగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

Written By:

జియోకి టెల్కోలు కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో ముఖేష్ అంబాని కంపెనీ మరో సంచలనానికి తెరలేపింది. తన ప్రైమ్ మెంబర్స్‌కు రిలయెన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. దివాళి సందర్భంగా ఆఫర్‌ చేసిన క్యాష్‌బ్యాక్‌ను మరోసారి తన ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లకు ప్రవేశపెట్టింది. రూ.399, ఆపై రీచార్జ్‌లతో రూ.2599 వరకు ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందించనున్నట్లు తెలిపింది. ఆఫర్ల పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

రెడ్‌మి ఫోన్లకు సవాల్ విసురుతున్న ఎలూగా ఐ5

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.399, ఆపై మొత్తాల రీఛార్జ్‌లకు..

మొత్తంగా రూ.399, ఆపై మొత్తాల రీఛార్జ్‌లకు రూ.2599 విలువైన ప్రయోజనాలను ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ కింద అందించనున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. దివాళి సందర్భంగా కేవలం రూ.399 రీఛార్జ్‌ ప్యాక్‌పై మాత్రమే అందుబాటులో ఉన్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను, ప్రస్తుతం రూ.399, ఆపై మొత్తాలన్నింటికీ ఆఫర్‌ చేయనున్నట్టు తెలిసింది.

నవంబర్‌ 10 నుంచి..

నవంబర్‌ 10 నుంచి ఈ ఆఫర్‌ నవంబర్‌ 25 వరకు అందుబాటులోకి రానుంది.

యో పార్టనర్‌ వాలెట్లు

అంతేకాక అదనంగా జియో పార్టనర్‌ వాలెట్లు అమెజాన్‌పే, యాక్సిస్‌పే, ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, ఫోన్‌పే నుంచి రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు ప్రతి రీఛార్జ్‌పై ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ కింద రూ.300 వరకు అందించనున్నట్టు తెలిపింది.

రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో..

రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్‌ చేయనుంది. తర్వాత రీఛార్జ్‌ ప్యాక్‌ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. డిజిటల్‌ వాలెట్ల నుంచి రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్‌లు అందనున్నాయి.

డొమెస్టిక్ ఫ్లెట్స్‌లో..

ఎజియో.కామ్‌లో రూ.1500, ఆపైన ట్రాన్సక్షన్స్ చేస్తే రూ.399 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక రిలయెన్స్‌ట్రెండ్స్.కామ్‌లో రూ.1999, ఆపై ట్రాన్సక్షన్స్ చేస్తే రూ.500 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇస్తారు. యాత్ర.కామ్‌తో కూడా జియో ఒప్పందం కుదుర్చుకుంది. డొమెస్టిక్ ఫ్లెట్స్‌లో రాను, పోను మొత్తం రూ.వెయ్యి వరకు డిస్కౌంట్ వస్తుంది.

ఉదాహరణకు

ఉదాహరణకు మీరు జియో నెట్‌వర్క్‌ వాడుతున్న కొత్త యూజర్‌ అయినట్టు అయితే, అమెజాన్‌ పే వాడి రూ.459తో రీఛార్జ్‌ చేసుకుంటే, రూ.400 విలువైన వోచర్లు, పే బ్యాలెన్స్‌ కింద రూ.99 క్యాష్‌బ్యాక్‌ మొత్తం రూ.499 అందనుంది.

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఇవే..

మొబిక్విక్ ద్వారా పాత కష్టమర్లకు రూ. 149(Code - Jio149), కొత్త కష్టమర్లకు రూ. 300(Code - NEWJIO), యాక్సిస్ పే ద్వారా పాత కష్టమర్లకు రూ. 35, కొత్త కష్టమర్లకు రూ. 100, అమెజాన్ పే ద్వారా పాత కష్టమర్లకు రూ.20, కొత్త కష్టమర్లకు రూ. 99, ఫోన్ పే ద్వారా పాత కష్టమర్లకు రూ.30, కొత్త కష్టమర్లకు రూ. 75, పేటీఎమ్ ద్వారా పాత కష్టమర్లకు రూ. 15 (Code - PAYTMJIO), కొత్త కష్టమర్లకు రూ.50 (Code - NEWJIO), ఫ్రీ చార్జ్ ద్వారా కేవలం కొత్త కష్టమర్లకు మాత్రమే రూ. 50 (Code - JIO50) క్యాష్‌బ్యాక్ లభించనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Offer to Provide Benefits of Up to Rs. 2,599 on Recharges of Rs. 399 and Above More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot