Home
News

రోజువారీ 2.5GB డేటా, 365 రోజుల వ్యాలిడిటీతో జియో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!

ప్రముఖ ప్రైవేటు టెలికాం దిగ్గజం జియో వినియోగదారులను ఆకట్టుకొనేందుకు అనేక మెరుగైన రీఛార్జీ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇందులో నెలవారీ నుంచి వార్షిక రీఛార్జ్‌ ప్లాన్‌ల (Jio 365 Days Validity Recharge Plans) వరకూ ఉన్నాయి. అయితే జియో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్‌లలో రెండు ప్లాన్‌లు ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు ప్లాన్‌లు 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటాయి. ఈ ప్లాన్‌ల కాలింగ్, డేటా సహా ఇతర ప్రయోజనాల పూర్తి వివరాలు.

జియో రూ.3599 రీఛార్జ్‌ ప్లాన్ : ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2.5GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. ప్లాన్‌ వ్యాలిడిటీలో మొత్తంగా 912.5GB డేటాను వినియోగించుకోవచ్చు.

jio annual recharge plans

5G సదుపాయం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను (Jio RS3599 Prepaid Recharge plan) వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌ ఎటువంటి OTT ప్రయోజనాలు అందించడం లేదు. జియోటీవీ, జియో సినిమా, జియోక్లౌ్డ్‌ సేవలను ఉచితంగా పొందవచ్చు.

జియో రూ.3,999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లో (Jio RS3999 Prepaid Recharge plan) భాగంగా రోజువారీ 2.5GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు.

జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలు మినహా ఎటువంటి ఓటీటీ ప్రయోజనాలు పొందలేరు. అయితే ఈ ప్లాన్‌ ద్వారా ఫ్యాన్‌ కోడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియోటీవీ మొబైల్‌ యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందలేరు.

పైరెండు వార్షిక రీఛార్జ్‌ ప్లాన్‌లలో ఓటీటీ సదుపాయం అందుబాటులో లేదు. వివిధ ఓటీటీలతో కూడిన రీఛార్జ్‌ ప్లాన్‌లు కూడా జియో అందిస్తోంది. ప్లాన్‌ల వారీగా డిస్నీ + హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, Sony LIV మరియు ZEE5, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ అన్ని రీఛార్జ్‌ ప్లాన్‌లు 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటాయి.

జియో రూ.949 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 90 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు రోజువారీ 2GB డేటా, 100 SMSను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

జియో రూ.1029 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 2GB డేటా సహా 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

జియో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.1049 Sony LIV మరియు ZEE5 లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS, 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

జియో రూ.1299 ప్లాన్‌ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 2GB హైస్పీడ్‌ డేటాతోపాటు 100 SMS లను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Jio Offers 2.5GB daily Data and unlimited calling prepaid recharge plans with 365 days validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X