మీరు అధిక డేటా ఉపయోగిస్తుంటారా.. రోజువారీ 3GB డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్‌లు ఇవిగో..!
జియో ప్రస్తుతం అనేక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. అధికంగా డేటా వినియోగించే వారి కోసం రోజువారీ 3GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్‌లను కూడా కలిగి ఉంది. అయితే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు. ప్రస్తుతం రూ.449, రూ.1199, రూ.1799 ప్లాన్‌లలో జియో రోజువారీగా 3GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌ల పూర్తి ప్రయోజనాల వివరాలు.
రూ.449 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs449 Recharge Plan) భాగంగా జియో ప్రీపెయిడ్ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ ను చేసుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 3GB డేటాను వినియోగించుకోవచ్చు.

5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 84GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది.
జియో యూజర్లు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. దీంతోపాటు 18 - 25 సంవత్సరాలు కలిగిన జియో యూజర్లు 18 నెలల వరకు గూగుల్ జెమిని ఏఐ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఏఐ మోడల్ సాధారణ ధర రూ.35100 గా ఉంటుందని జియో చెబుతోంది.
జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. క్లౌడ్ ద్వారా 50GB వరకు స్టోరేజీని పొందవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
రూ.1199 జియో రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఇందులో రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. మొత్తంగా 252GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్ మొబైల్ / టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు 18 - 25 సంవత్సరాలు కలిగిన జియో యూజర్లు 18 నెలల వరకు గూగుల్ జెమిని ఏఐ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఏఐ మోడల్ సాధారణ ధర రూ.35100 గా ఉంటుందని జియో చెబుతోంది.
ఈ ప్లాన్‌లో (Jio Rs1199 Recharge Plan) జియో టీవీ, జియో ఏఐక్లౌడ్ వంటి యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. క్లౌడ్ ద్వారా 50GB వరకు స్టోరేజీని వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహోమ్, జియో ఫైనాన్స్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
జియో రూ.1799 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఇందులో రోజువారీ 3GB డేటాను పొందవచ్చు.
5G స్మార్ట్‌ఫోన్, 5G నెట్‌వర్క్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. మొత్తంగా 252GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్ మొబైల్ / టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
దీంతోపాటు నెట్‌ఫ్లిక్స్ (బేసిక్) సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. మరియు 18 - 25 సంవత్సరాలు కలిగిన జియో యూజర్లు 18 నెలల వరకు గూగుల్ జెమిని ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఏఐ మోడల్ సాధారణ ధర రూ.35100 గా ఉంటుందని జియో చెబుతోంది.
ఈ ప్లాన్‌లో (Jio Rs1799 Recharge Plan) జియో టీవీ, జియో ఏఐక్లౌడ్ వంటి యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. క్లౌడ్ ద్వారా 50GB వరకు స్టోరేజీని వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహోమ్, జియో ఫైనాన్స్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications








