ఈ జియో ప్లాన్లతో, 40GB 5G డేటా ఉచితంగా పొందండి! వివరాలు
ప్రస్తుత్తం, IPL 2023 సీజన్ కొనసాగుతున్న కారణంగా, Jio తన వినియోగదారుల కోసం కొత్త క్రికెట్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు అన్ లిమిటెడ్ కాలింగ్ మరియు 5G ప్రయోజనాలతో 3GB వరకు రోజువారీ డేటాను అందిస్తాయి. అలాగే ఉచితంగా JioCinemaలో మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమ్‌లను వీక్షించడంలో సహాయం చేస్తాయి.
ఇంకా, ఈ జియో యొక్క ఈ ప్లాన్ల ద్వారా వారికి ఇష్టమైన సిరీస్‌లు లేదా చలనచిత్రాలను సులభంగా ఆస్వాదించడంలో వినియోగదారులకు జియో 40GB వరకు అదనపు ఉచిత 5G డేటాను కూడా అందిస్తోంది. ఇక ఈ ప్లాన్‌లు మరియు వాటి ప్రయోజనాల వివరాలను మరింత లోతుగా పరిశీలిద్దాం.

జియో 3GB రోజువారీ డేటా ప్లాన్‌ల వివరాలు,
జియో ఈ IPL సందర్భంగా మూడు కొత్త క్రికెట్ ప్రత్యేక ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఇవి రూ. 219, రూ. 399 మరియు రూ. 999, ధర తో ఉన్నాయి. ఇక వీటి ప్రయోజనాలు గమనిస్తే కాలింగ్, SMS మరియు ఇతర ప్రయోజనాలతో పాటు 40GB వరకు అదనపు ఉచిత 5G డేటాను అందిస్తాయి.
జియో రూ. 219 ప్లాన్ యొక్క ప్రయోజనాలు,
జియో యొక్క ఈ ప్లాన్ వినియోగదారులకు అన్ లిమిటెడ్ కాలింగ్, 100 రోజువారీ SMS లు మరియు రోజుకు 3GB వరకు డేటాను అందిస్తుంది. అదనంగా, వినియోగదారులు 14 రోజుల పాటు Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని మరియు రూ. 25 విలువైన 2GB డేటా యాడ్-ఆన్ వోచర్‌ను పొందుతారు. మీరు Jio వెల్‌కమ్ 5G ఆఫర్‌కు అర్హులైతే, అదనపు ఖర్చు లేకుండా 5G డేటా అందుబాటులో ఉంటుంది.
జియో రూ. 399 ప్లాన్ యొక్క ప్రయోజనాలు,
ఈ ప్లాన్ కింద, వినియోగదారులు జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత కాలింగ్, 100 రోజువారీ SMS లు మరియు రోజుకు 3GB వరకు డేటాను పొందవచ్చు. ప్రత్యేక ఆఫర్‌గా, వినియోగదారులు రూ. 61 విలువైన 6GB డేటా యాడ్ ఆన్ వోచర్‌ను కూడా ఉచితంగా అందుకుంటారు. ఇది 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
జియో రూ. 999 ప్లాన్ యొక్క ప్రయోజనాలు,
ఈ ప్లాన్ జియో యొక్క యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రోజుకు 100 SMS లు, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 3GB డేటాను అందిస్తుంది. ఇది 84 రోజులు వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ద్వారా 5G యాక్సెస్ ఉన్న వినియోగదారులు పరిమిత సమయం వరకు రూ. 241 విలువైన అదనపు 40GB ఉచిత డేటాను కూడా పొందవచ్చు.
ఎయిర్టెల్ యొక్క 3GB డేటా ప్లాన్ ప్రయోజనాలు,
జియో యొక్క పోటీదారు అయిన ఎయిర్టెల్ కూడా, దాని వినియోగదారుల కోసం అదనపు OTT ప్రయోజనాలతో 3GB డేటా ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఎయిర్టెల్ వినియోగదారులు రూ. 199, రూ. 499 మరియు రూ. 699 అనే మూడు ప్లాన్‌ల నుండి ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లు అపరిమిత కాలింగ్, SMS మరియు OTT ప్రయోజనాలను అందిస్తాయి. అర్హత ఉన్న వినియోగదారులు అపరిమిత 5G డేటాను కూడా ఆస్వాదించవచ్చు. మరిన్ని వివరాల కోసం, వినియోగదారులు Airtel థాంక్స్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ని తనిఖీ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








