రిలయన్స్ ఉచిత కూపన్లు, ఇలా సొంతం చేసుకోండి
దేశీయ టెలికాం రంగంలో తిరుగులేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో యూజర్ల కోసం రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ పై ఉచితంగా AJIO కూపన్స్ ఆఫర్ చేస్తోంది. రూ.198, రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లపై జియో తమ యూజర్లకు ఫ్రీగా కూపన్స్ అందిస్తోంది.

ఈ ఆఫర్ జూన్ 3 నుంచి జూలై 14, 2019 వరకు అందుబాటులో ఉంటుంది. జియో కొత్త యూజర్లతో పాటు పాత జియో యూజర్ల అందరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్స్ ఎంచుకున్న పోస్టు పెయిడ్ జియో యూజర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరి ప్లాన్లు వివరాలు ఏంటీ ఎలా ఉచిత ఆఫర్లు పొందాలనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ రూ.198తో యాక్టివేట్ చేసుకుంటే.. AJIO కూపన్ ఆఫర్ ఉచితంగా పొందవచ్చు. ఈ కూపన్ ను ఐదుసార్లు వరకు రీడీమ్ చేసుకోవచ్చు. ప్రతినెలా ఒకసారి మాత్రమే ఈ కూపన్ పనిచేస్తుంది. రూ.198 రీఛార్జ్ AJIO కూపన్ రీడీమ్ చేయాలంటే.. యూజర్లు కనీస కార్ట్ విలువ రూ.999 వరకు ఉండాలి.
రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
ఈ ఆఫర్.. రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు కూడా వర్తిస్తుంది. AJIO కూపన్ కూడా పొందవచ్చు. ఈ కూపన్ కూడా ఐదుసార్లు రీడీమ్ చేసుకోవచ్చు. కానీ, ప్రతినెలా ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. ఈ కూపన్ రీడీమ్ చేయాలంటే యూజర్లు కనీస కార్డ్ విలువ రూ.1,399 వరకు అవసరం ఉంటుంది.

AJIO డిస్కౌంట్ కూపన్లు కాల పరిమితి
AJIO వెబ్ సైట్లోని (ఎగ్జిస్టింగ్ ఆఫర్లలో) AJIO డిస్కౌంట్ కూపన్లు కాల పరిమితి ముగియనున్నట్టు రిలయన్స్ జియో వెల్లడించింది. ఈ కొత్త ఆఫర్.. జూలై 14తో ముగియనుంది. కూపన్లు పొందాలంటే యూజర్లు ఈ తేదీలోగా రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

వరల్డ్ కప్ 2019 మ్యాచ్ లన్నీ ఉచితం
రిలయన్స్ జియో..హాట్ స్టార్ భాగస్వామ్యంతో యూజర్లకు వరల్డ్ కప్ 2019 మ్యాచ్ లన్నింటిని ఉచితంగా ఆఫర్ చేస్తోంది. యూజర్ల కోసం రూ.251తో కొత్త అన్ లిమిటెడ్ క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా యూజర్లు.. వరల్డ్ కప్ మ్యాచ్ లను వీక్షించేందుకు 51 రోజుల పాటు 102GB డేటాను పొందవచ్చు.

రూ.2వేలు తక్కువగా
ఇదిలా ఉంటే గిగా ఫైబర్ ధర భారీగా తగ్గినట్టు మీడియాలో పలు అంచనాలు వెలువడుతున్నాయి. గతానికంటే రూ.2వేలు తక్కువగా అంటే రూ.2,500కే కనెక్షన్ అందిస్తున్నట్లు కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు తాజాగా అందిస్తున్న గిగా ఫైబర్‌లో కనెక్షన్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
రూ.2 వేలు తగ్గింపుతో రూ.2,500కే ,
దీని ప్రకారం ఇంకా వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించనప్పటికీ గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఈ సేవల్ని పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించే మొత్తాన్ని కూడా జియో తగ్గించినట్లుగా తెలుస్తోంది. జియో గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలకుగాను సెక్యూరిటీ డిపాజిట్ రూ.4,500గా ఉంది. ప్రస్తుతం దీన్ని రూ.2 వేలు తగ్గింపుతో రూ.2,500కే గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తేనుంది. అయితే వేగాన్ని 50ఎంబీపీఎస్ తగ్గించినట్టు సమాచారం.

పాత ప్లాన్
పాత ప్లాన్‌ప్రకారం రూ.4,500 కనెక్షన్‌తో డ్యుయల్ బ్యాండ్ రోటర్ అందిస్తుండగా , తాజా ప్లాన్‌లో రూ.2,500 కనెక్షన్ ప్లాన్‌తో సింగిల్ బ్యాండ్ వైఫై రోటర్‌ను అందివ్వనుంది. అలాగే మొదటి ప్లాన్‌తో పోలిస్తే రెండో ప్లాన్‌లో వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి ప్లాన్ వేగం 50ఎంబీపీఎస్ ఉంటే, రెండో ప్లాన్ వేగం 100 ఎంబీపీఎస్ ఉండనుంది. అంటే సగం తగ్గనుందన్నమాట. దీంతోపాటు యూజర్లకు నెలకు 100 జీడీ డేటా, వాయిస్ కాల్స్ ఉచితం. అంతేకాదు జియో టీవీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ప్లాన్ యూజర్లకు మాత్రం వాయిస్ కాల్ సర్వీసు అందుబాటులో లేవు. అయితే తాజా ప్లాన్‌పై జియో సంస్థ ఎలాంటి అధికారిక ధృవీకరణ చేయలేదు.


Click it and Unblock the Notifications








