జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ రెండు ప్లాన్‌లపై జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం..!
భారత్ టెలికాం రంగంలో జియో కీలక మార్పులు తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో భారీ సంఖ్యలో యూజర్లను సంపాదించుకుంది. అప్పటి వరకు డేటా ధరలు ఎక్కువగా ఉండగా.. జియో రాకతో ఒక్కసారిగా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లా్‌న్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో కొన్ని ప్లాన్‌లలో కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలతోపాటు ఓటీటీ సహా ఇతర యాప్స్‌ను అందిస్తోంది.
తాజాగా జియో కీలక ప్రకటన చేసింది. రూ.175, రూ.445 రీఛార్జ్ ప్లాన్స్‌లో జియో టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను (JioTV Premium Subscription) అందించనుంది. ఇందులో భాగంగా టీవీ ఛానళ్లతోపాటు కొన్ని ప్రముఖ ఓటీటీలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో సోనీ లివ్, Zee5, Sun NXT, డిస్కవరీ ప్లస్, saavn, ప్లానెట్ మరాఠీ, ఫ్యాన్‌కోడ్, లైన్‌గేట్ ప్లే వంటి ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.

జియో రూ.175 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs175 Recharge Plan) భాగంగా యూజర్లు 10GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. యూజర్లుకు అనేక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందుతారు. సోనీ లివ్, Zee5, Sun NXT, డిస్కవరీ ప్లస్, ప్లానట్ మరాఠీ, జియో సహా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
జియో రూ.445 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64 Kbps గా ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. మొత్తంగా 56GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.
4G డేటాతోపాటు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. జియో యూజర్లు 90 రోజుల వరకు జియోహాట్‌స్టార్ మొబైల్/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు జియోAI క్లౌడ్ ద్వారా 50GB వరకు ఉచితంగా స్టోరేజీని పొందవచ్చు.
దీంతోపాటు (Jio Rs445 Recharge Plan) అనేక ఓటీటీ ప్రయోజనాలను అందిస్తోంది. సోనీ లివ్, Zee5, లైట్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, Sun NXT, ప్లానెట్ మరాఠీ, Chaupal, hoichoi, kanchha lannka యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. జియో టీవీ ద్వారా వీటిని పొందవచ్చు.
జియో రూ.1049 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు, ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది మొత్తంగా 168GB 4G డేటాను పొందవచ్చు.
దీంతోపాటు యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా జియో టీవీ యాప్ ద్వారా సోనీ లివ్ మరియు Zee5 ను ఉపయోగించుకోవచ్చు. మరియు 90 రోజుల వరకు జియోహాట్‌స్టార్ మొబైల్/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు జియో AI క్లౌడ్ యాప్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








