Netflix సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ 5G డేటా, 84 రోజుల వ్యాలిడిటీతో జియో రీఛార్జ్ ప్లాన్స్..!
భారత్ టెలికాం రంగంలో యూజర్ల పరంగా జియో తొలి స్థానంలో ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది. ఇందులో కాలింగ్ కోసం ప్రత్యేక ప్లాన్ లు ఉన్నాయి. అదే విధంగా ఓటీటీ ప్రయోజనాలతో మరిన్ని ప్లాన్‌లు ఉన్నాయి. మరియు డేటా ప్యాక్స్ కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తో కొన్ని రీఛార్జ్ ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి.
ఒకే రీఛార్జ్ ప్లాన్ లో :
ప్రస్తుతం అనేక మంది టీవీ షో లు, ఈవెంట్స్, సినిమాల కోసం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లను తీసుకుంటున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్ లు వెతకాల్సిన అవసరం లేకుండా టెలికాం సంస్థలు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ లను తీసుకొచ్చాయి. సింగిల్ రీఛార్జ్ ప్లాన్ లో ఓటీటీతోపాటు ( OTT Plans ) కాలింగ్, డేటా అవసరాలు కూడా తీరిపోనున్నాయి.

ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లు కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలతోపాటు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ను ( Jio Netflix Prepaid recharge plans ) కూడా అందిస్తోంది. దీంతోపాటు జియో యాప్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు ప్లాన్ లు అన్‌లిమిడెట్ 5G డేటాను కూడా అందిస్తున్నాయి.
జియో రూ.1299 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో ( Jio Rs1299 Prepaid Recharge Plan ) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో ప్రతిరోజు 2GB 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్ లో మొత్తంగా 168GB 4G డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. జియో టీవీ, జియో ఏఐక్లౌడ్ యాప్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.
జియో రూ.1799 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో ( Jio Rs1799 Prepaid Recharge Plan ) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో ప్రతి రోజు 3GB 4G డేటాను పొందవచ్చు. మరియు అన్ లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్ లో మొత్తంగా 252GB 4G డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. జియోటీవీ, జియో ఏఐక్లౌడ్ యాప్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








