Home
News

రూ.1234 రీఛార్జ్ ప్లాన్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డేటా, SMS లతో సహా..!

జియో ప్రస్తుతం దేశంలో యూజర్ల పరంగా అతిపెద్ద నెట్‌వర్క్‌ గా ఉంది. అయితే స్మార్ట్‌ఫోన్‌ లతోపాటు ఫీచర్‌ ఫోన్‌ల కోసం ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌ లను కలిగి ఉన్నాయి. ఇందులో జియోఫోన్‌, జియోభారత్‌ ఫోన్‌ లు ఉన్నాయి. ఫీచర్‌ ఫోన్‌ లు ఉపయోగిస్తున్న వారికి హైస్పీడ్‌ డేటా సహా ఇతర ప్రయోజనాలను అందించేందుకు వీలుగా జియో ఈ ఫోన్‌ లను తీసుకొచ్చింది.

* జియో భారత్‌ ఫోన్‌ రూ.123 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Jio Rs123 Recharge plans) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు.

Jio Offers rs123  Rs234  Rs1234 Plans exclusively for jiobharat phones full details

ఈ ప్లాన్‌ లో ( JioBharat Phones Recharge Plans ) భాగంగా రోజువారీ 0.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. మొత్తంగా 14GB డేటాను పొందవచ్చు. Jiosaavn, జియోటీవీ యూప్‌ లను కూడా ఉపయోగించుకోవచ్చు.

* జియో రూ.234 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో భాగంగా జియోభారత్‌ ఫోన్‌ యూజర్లు 58 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతి 28 రోజులకు 300 చొప్పున SMS లను అందిస్తుంది. అంటే మొత్తంగా 600 SMS లను పొందవచ్చు.

దీంతోపాటు ఈ ప్లాన్‌ లో ( Jio Rs234 Recharge plans ) భాగంగా 0.5GB డేటాను రోజువారీ పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీలో మొత్తంగా 28GB డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌ లో భాగంగా Jiosaavn, జియోటీవీ యాప్స్‌ ను వినియోగించుకోవచ్చు.

* రూ.1234 రీఛార్జ్‌ ప్లాన్ :
జియోభారత్‌ ఫోన్ ( Jio Rs1234 Recharge plans ) యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో ప్రతి 28 రోజులకు 300 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 0.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 గా ఉంది. సుమారు 11 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో మొత్తంగా 168GB డేటాను పొందవచ్చు. మరియు Jiosaavn, జియోటీవీ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

గ్రామీణ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక మంది ఫీచర్‌ ఫోన్‌ లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి యూజర్లకు 4G డేటాతోపాటు మెరుగైన ప్రయోజనాలను అందించడం కోసం జియో ఫీచర్‌ ఫోన్లను లాంచ్‌ చేస్తున్నట్లు గతంలో జియో తెలిపింది. దేశీయ మొబైల్‌ తయారీ సంస్థల భాగస్వామ్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొస్తోంది.

కేవలం కాలింగ్‌ అవసరాలు మరియు తక్కువ డేటా అవసరాలు ఉన్న యూజర్లకు ఈ ఫోన్లు అనుకూలంగా ఉంటాయి. మరియు ఈ ఫోన్ల కోసం జియో ప్రత్యేకంగా తక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ లో యూప్‌ లను కూడా ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Offers rs123, Rs234, Rs1234 Plans exclusively for jiobharat phones full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X