Home
News

రీఛార్జ్‌ ప్లాన్ ధర రూ.895.. వ్యాలిడిటీ ఏకంగా 336 రోజులు.. పూర్తి ప్రయోజనాలు ఇవే..!

Jio Rs895 Recharge Plan : భారత టెలికాం రంగంలో జియో చాలా మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా అన్‌లిమిటెడ్‌ డేటా, కాలింగ్‌తో భారీగా యూజర్లను తన వైపునకు తిప్పుకుంది. దీంతో మిగిలిన టెలికాం సంస్థలు కూడా ఇదే ఫార్ములాను అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో సుమారు 46 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, BSNL ఉన్నాయి.

ప్రస్తుతం జియో అనేక బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. యూజర్ల కాలింగ్‌, డేటా, SMS అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను కలిగి ఉంది. గత సంవత్సరం జులైలో మొబైల్‌ రీఛార్జ్ ధరల పెంపుతో కాస్త ఒడుదొడుకులకు లోనైన జియో.. మళ్లీ తిరిగి పంజుకుంది.

jio Offers Rs895 Recharge plan

అయితే ప్రస్తుతం జియో ప్లాన్‌ ఒకటి బాగా ట్రెండింగ్‌లో ఉంది. తక్కువ ధరలో ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ పొందాలని భావిస్తున్న వారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా కాలింగ్‌, డేటా, SMS లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌ పూర్తి ప్రయోజనాల వివరాలు.

జియో రూ.895 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతి 28 రోజులకు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతి 28 రోజులకు 50 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. అంటే సుమారుగా 11 నెలల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 24GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ప్రయోజనాల పరంగా చూసుకుంటే కాలింగ్‌ కోసం ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియో AI క్లౌడ్‌ యాప్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

అయితే ఈ ప్లాన్‌ కేవలం జియో ఫోన్‌ (JioPhone) యూజర్లుకు మాత్రమే అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఈ ప్లాన్‌ ప్రయోజనాలను పొందలేరు. ఇప్పటికీ అనేక మంది 2G, 3G నెట్‌వర్క్‌ను ఉపయోగించేవారున్నారు. అలాంటి వారికి 4G డేటా, ఇతర సదుపాయాలను అందించేందుకు వీలుగా ఈ ప్లాన్‌లను జియో తీసుకొచ్చింది.

యూజర్లు రూ.125 తో రీఛార్జ్‌ ప్లాన్‌ :
తక్కువ ధరలో జియో యూజర్లకు మరో ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. జియో ఫోన్ యూజర్లు రూ.125 తో రీఛార్జ్‌ చేసుకుంటే 23 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 0.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. వ్యాలిడిటీ మొత్తంగా 11.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. మరియు మొత్తంగా 300 SMS లను పొందవచ్చు. వీటితోపాటు జియోటీవీ, జియో AI క్లౌడ్‌ స్టోరేజీని పొందవచ్చు.

జియో రూ.152 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియోఫోన్‌ యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 0.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. మరియు మొత్తంగా 300 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌లో మొత్తంగా 14GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా జియోఫోన్‌ యూజర్లు జియో టీవీ, జియో AI క్లౌడ్‌ వంటి యాప్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. పైన తెలిపిన ప్లాన్‌లు అన్నీ.. జియో ఫోన్‌ యూజర్లకు మాత్రమే అని యూజర్లు గమనించుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఈ ప్లాన్‌లు వినియోగించుకోలేరు.

Best Mobiles in India

English summary
jio Offers Rs895 Recharge plan with 336 days validity for jiophone users only
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X