Jio నుంచి రూ.3వేల లోపు, ఏడాది వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్స్ ఇవే!
భారతదేశంలో అత్యధిక యూజర్లను కలిగిన టెలికం కంపెనీ రిలయన్స్ Jio, నిత్యం కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను విడుదల చేస్తుంది. Jio వినియోగదారులు వార్షిక లేదా దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్రీపెయిడ్ ప్లాన్ కోసం వెళ్లాలనుకుంటే అనేక ఆప్షన్లను అందిస్తోంది.

ఇందులో భాగంగా Jio మూడు ప్లాన్‌లను కలిగి ఉంది, ఇవి దీర్ఘకాలిక వ్యాలిడిటీతో వస్తాయి. అయితే వాటి ధర రూ.3000 కంటే తక్కువ. అయితే ఒకటి సుమారు 11 నెలల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లన్నీ వినియోగదారులకు డేటాతో పాటు వాయిస్-కాలింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్లాన్‌లన్నింటినీ ఒకసారి పరిశీలిద్దాం.

రిలయన్స్ Jio నుంచి రూ.2,999 ప్లాన్ :
రిలయన్స్ Jio కు సంబంధించి 2022 ప్రారంభంలో విడుదలైన దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.2,999. లాంగ్ టర్మ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని జియో ఈ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. 75జీబీ డేటా బోనస్ ప్లస్ కూపన్ పొందొచ్చు.
ఈ ప్లాన్ ద్వారా ఏడాది మొత్తంలో కంపెనీ 912.5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తోంది. దాంతో పాటు పలు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తోంది. ఇంకా అదనంగా జియో యూజర్లు Jio టీవీ, Jio సినిమా, Jio సెక్యురిటీ, Jio క్లౌడ్ యాక్సెస్ కూడా కల్పిస్తోంది. FUP లిమిట్ దాటిన తర్వాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఇదే కాకుండా రూ.4199 ప్లాన్ ద్వారా కూడా ఇదే తరహా జియో దీర్ఘకాల ప్రయోజనాల్ని కల్పిస్తోంది. ఈ ప్లాన్‌తో డైలీ డేటా 3జీ పొందవచ్చు. కానీ, రెండిటినీ పోల్చుకుంటే రూ.2999 ప్లాన్‌తో తక్కువ ధరలో దీర్ఘకాల ప్రయోజనాల్ని పొందవచ్చు.

రిలయన్స్ Jio నుంచి రూ.2,897 ప్లాన్ :
రిలయన్స్ Jio కు సంబంధించి మరో దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.2,897. లాంగ్ టర్మ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని జియో ఈ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 2 జీబీ డేటాను పొందవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు.
ఈ ప్లాన్ ద్వారా ఏడాది మొత్తంలో కంపెనీ 730జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తోంది. దాంతో పాటు పలు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఇంకా అదనంగా జియో యూజర్లు Jio టీవీ, Jio సినిమా, Jio సెక్యురిటీ, Jio క్లౌడ్ యాక్సెస్ కూడా కల్పిస్తోంది. FUP లిమిట్ దాటిన తర్వాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది.

రిలయన్స్ Jio నుంచి రూ.2,897 ప్లాన్ :
రిలయన్స్ Jio కు సంబంధించి మరో దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.2,525. లాంగ్ టర్మ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని జియో ఈ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 1.5 జీబీ డేటాను పొందవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు.
ఈ ప్లాన్ ద్వారా ఏడాది మొత్తంలో కంపెనీ 504జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తోంది. దాంతో పాటు పలు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఇంకా అదనంగా జియో యూజర్లు Jio టీవీ, Jio సినిమా, Jio సెక్యురిటీ, Jio క్లౌడ్ యాక్సెస్ కూడా కల్పిస్తోంది. FUP లిమిట్ దాటిన తర్వాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది.

రూ.2999 ప్లాన్ బెస్ట్ ఎంపిక:
రూ.2999 ప్లాన్‌తో కూడిన డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మొబైల్ టైర్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. రూ.2897 మరియు రూ.2999 ప్లాన్‌ల మధ్య ధరలో పెద్దగా వ్యత్యాసం లేదు. మీరు రూ.2897 ప్లాన్‌కి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే రూ.2999 ఉత్తమ ఎంపిక. ఎందుకంటే.. రూ.2999 ప్లాన్ 75GB అదనపు డేటాతో పాటు చాలా అదనపు ప్రయోజనాలతో వస్తోంది.


Click it and Unblock the Notifications