కేవలం కాలింగ్ కోసమే ఫోన్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ ప్లాన్‌ల వివరాలు మీకోసమే..!
జియో యూజర్ల పరంగా దేశంలో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇందులో కాలింగ్, డేటా, SMS, OTT ప్రయోజనాలను అందించే ప్లాన్‌లు ఉన్నాయి. డేటా కోసం కూడా ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది.
టెలికాం రెగ్యూలేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సూచనల ప్రకారం ప్రత్యేకంగా కాలింగ్ కోసం రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS లను మాత్రమే అందిస్తుంది. ఎటువంటి డేటా ప్రయోజనాలను అందించడం లేదు. ఆ జాబితాలో రూ.448, రూ.1748 రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి.

జియో రూ.448 రీఛార్జ్ ప్లాన్ :
జియో వెబ్‌సైట్ వివరాల ఆధారంగా ఈ ప్లాన్‌లో (Jio Rs448 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు మొత్తంగా 1000 SMS లను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా సహా ఇతర ప్రయోజనాలను అందించడం లేదు.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. వీటితోపాటు జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. కేవలం కాలింగ్ కోసమే ఫోన్ ఉపయోగించే వారు లేదా డేటా కోసం ప్రత్యేక సిమ్ కార్డు లేదా వైఫై వంటి సదుపాయాలు ఉన్న వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
జియో రూ.1748 రీఛార్జ్ ప్లాన్ :
జియో వెబ్‌సైట్ వివరాల ఆధారంగా ఈ ప్లాన్‌లో (Jio Rs1748 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్ STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 3600 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటాను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. కేవలం కాలింగ్ కోసమే ఈ ప్లాన్ వినియోగపడుతుంది. డేటా అవసరాలు లేని యూజర్లు, డేటా కోసం వేరే సిమ్ కార్డు లేదా వైఫై వంటి సదుపాయాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
* ఎయిర్‌టెల్ కూడా వాయిస్ కోసం ప్రత్యేక ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో మూడు ప్లాన్‌లు ఉన్నాయి. ఎయిర్‌టెల్ రూ.469 రీఛార్జ్ ప్లాన్‌లో కాలింగ్ సహా 900 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. హలోట్యూన్స్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ఎయిట్‌టెల్ రూ.489 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, 600 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 6GB డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంటుంది. హలోట్యూన్స్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.548 రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మొత్తంగా 900 SMS లను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 7GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. హలోట్యూన్స్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








