Home
News

పుడ్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జియో

By Gizbot Bureau

దేశీయ టెలికాం రంగంలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్తగా దూసుకువెళుతోంది. టెలికాం మార్కెట్ రంగాన్ని జియోకు ముందు జియోకు తరువాత అన్న చందంగా మార్చివేసిన ఈ దిగ్గజం యూజర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూపోతోంది. ఇందులో భాగంగా దేశీయ అతిపెద్ద రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ సర్వీస్ సంస్థ డైన్అవుట్‌తో రిలయన్స్ జియో జత కట్టింది. డైన్‌ అవుట్‌ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్‌‌కు రిలయన్స్ జియో డిజిటల్ భాగస్వామిగా మారి కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది.

Reliance Jio partners Dineout for Great Indian Restaurant Festival

2019 ఆగస్ట్ 1 మొదలైన ఈ ఫెస్టివల్‌ 2019 సెప్టెంబర్ 1వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, గోవా, జైపూర్, లక్నో, ఇండోర్, సూరత్, కొచ్చి, లుధియానా, నాగ్‌పూర్ నగరాల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
మొదటి బుకింగ్‌పై రూ.100 తగ్గింపు - డైన్‌అవుట్‌ ద్వారా టేబుల్‌ రిజర్వేషన్స్ చేసేవారికి సాధారణంగా బుకింగ్ ఫీజు వసూలు చేస్తుంది. కానీ ఈ ప్లాట్‌ఫాంలో జియో యూజర్లు చేసుకునే మొదటి బుకింగ్‌పై రూ.100 తగ్గింపు లభిస్తుంది. ఇది జియో వినియోగదారులకు మాత్రమే ప్రత్యేకంగా. అలాగే బిల్లుపై పత్ర్యేక డిస్కౌంట్‌ను కూడా అందిస్తుంది. దీంతోపాటు ఫుడ్, డ్రింక్స్, బఫేపై 1+1 ఆఫర్స్ పొందొచ్చు.

Reliance Jio partners Dineout for Great Indian Restaurant Festival

డైన్అవుట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న 17 పట్టణాల్లో, ఎనిమిదివేలకు పైగా రెస్టారెంట్లలో ఈ తగ్గింపు లభిస్తుంది. అలాగే టోటల్‌ ఫుడ్ బిల్, డ్రింక్స్ బిల్, బఫేపై 50శాతం తగ్గింపు ఆఫర్. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం జియో యూజర్లకు మాత్రమే. మైజియో యాప్‌ ద్వారా జియో యూజర్లు కూపన్స్ సెక్షన్‌లో డిస్కౌంట్ కోడ్ పొంది, డైన్అవుట్ ప్లాట్‌ఫామ్‌లో కూపన్స్ రీడీమ్ చేసుకోవచ్చు.

Reliance Jio partners Dineout for Great Indian Restaurant Festival

www.dineout.co.in

ఇదిలా ఉంటే ప్రియుల కోసం అద్భుతమైన ఆఫర్లను డైన్ అవుట్ అందిస్తున్నదీ. ఒకటి కాదు... రెండు కాదు, ఏకంగా రెండువేల రెస్టారెంట్లలో పసందైన వంటలపైన 50 శాతం డిస్కౌంట్ అందిస్తున్నది. ఇకపై హైదరాబాద్‌లో ఉంటే ఎంజాయ్ చేసేవాళ్లం అనుకోవాల్సిన అవసరం లేదు. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లోని రెస్టారెంట్లలో ఈ ఫెస్టివల్ ఆఫర్లను ఎంజాయ్ చేయవచ్చు. మీ స్నేహితులతో కలిసి ఫుడ్, డ్రింక్, బఫె ఏదైనా సరే, మీ మనసుకు నచ్చినదాన్ని ఆస్వాదించవచ్చు. ఓలివ్ బిస్ట్రో, హార్డ్ రాక్ కేఫ్, మంకీబార్, రాడిసన్ బ్లూ ఏదైనా సరే, డైన్‌అవుట్‌లో మీ ఫేవరెట్ రెస్టారెంట్‌ని ఎంచుకోవచ్చు. మీరూ ఈ ఫెస్టివల్‌లో భాగం పంచుకోవాలనుకుంటే www.dineout.co.inని చూడవచ్చు

Best Mobiles in India

English summary
Reliance Jio partners Dineout for Great Indian Restaurant Festival
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X