ఈ సారి పేమెంట్ బ్యాంకులను టార్గెట్ చేసిన జియో, 10 పాయింట్లు మీ కోసం

Written By:

టెలికాం మార్కెట్లో దిగ్గజాలకు చుక్కలు చూపించిన జియో ఇప్పుడు పేమెంట్ రంగంలో సత్తా చాటేందుకు రెడీ అయింది. వచ్చిన ఏడాదిలోనే 16 కోట్ల మంది కస్టమర్లను సంపాదించి డేటా విప్లవాన్నే సృష్టించింది. ఇప్పుడు అదే ఊపులో పేమెంట్ బ్యాంకులకు చుక్కలు చూపించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సరికొత్తగా సేవలను ప్రారంభించింది. కాగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెల్లింపుల సేవల కోసం గాను పేమెంట్స్ బ్యాంకులు ఏర్పాటు చేసుకునేందుకు 11 సంస్థలకు 2015లో లైసెన్స్‌లు ఇచ్చింది. తొలుత ఎయిర్‌టెల్ సంస్థ గతేడాది నవంబర్‌లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించి తొలి కంపెనీగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఏడాది మే నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు మొదలయ్యాయి. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకు సేవలు మొదలయ్యాయి. పోస్టల్ విభాగం కూడా పేమెంట్స్ బ్యాంకు సేవలను త్వరలోనే ఆరంభించనుంది. ఖాతాల్లో లక్ష వరకు డిపాజిట్ చేసుకునేందుకు ఈ సంస్థలు అనుమతిస్తాయి. బ్యాంకులతో టైఅప్ అయి పలు రకాల సేవలు అందించేందుకూ అవకాశం ఉంది. కాగా వీటి సరసన ఇప్పుడు జియో బ్యాంకు కూడా చేరనుంది. ఈ బ్యాంకులకి సంబంధించి ఓ 10 పాయింట్లు మీముందుకు తెస్తున్నాం.

ఇకపై మీరు ఆధార్ నంబర్ చెప్పనవసరం లేదు,Virtual IDపై ఓ స్మార్ట్ లుక్కేయండి

ఈ సారి పేమెంట్ బ్యాంకులను టార్గెట్ చేసిన జియో, 10 పాయింట్లు మీ కోసం

10 ప్రధాన పాయింట్లు ఇవే..
1. రిలయన్స్ ఇండస్ట్రీ జియో పేమెంట్ బ్యాంకుని ప్రమోట్ చేస్తుంది.
2. రిలయన్స్ ఇండస్ట్రీ దేశంలోనే అతి పెద్ద బ్యాంకు ఎస్‌బిఐలు కలిసి జాయింట్ వెంచర్‌గా జియో పేమెంట్ బ్యాంకును ప్రారంభించాయి.
3. energy conglomerate's annual report of 2017 ప్రకారం ఈ బ్యాంకుకు 70 శాతం నిధులను రిలయన్స్ ఇండస్ట్రీ అలాగే 30 శాతం నిధులను SBI సమకూర్చనున్నాయి.
4. 1949 Banking Regulation చట్టం పరిధిలోని Section 22 (1) కింద జియో బ్యాంకుకి లైసెన్స్ మంజూరు చేసినట్లు ఆర్బిఐ తెలిపింది.
5. August 19, 2015న రిలయన్స్ జియో ఈ పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్బిఐ లైసెన్స్ ఇచ్చింది.
6. జియో బ్యాంకుతో పాటు Aditya Birla Nuvo, Bharti Airtel, Department of Posts, Tech Mahindra and Vodafone కంపెనీలు ఈ లైసెన్స్ పొందిన వాటిలో ఉన్నాయి.
7. 2015న మొత్తం 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు లభించాయి. వీటిల్లో పేటీఎమ్ కూడా ఉంది.
8. అయితే వీటిలో తొలిసారిగా పేమెంట్ బ్యాంకుని ప్రారంభించింది మాత్రం భారతి ఎయిర్ టెల్. నవంబర్ 2016న భారతి ఎయిర్ టెల్ తన పేమెంట్ కార్యకలాపాలను ప్రారంభించింది.
9. ఇప్పుడు వచ్చిన జియో కన్నా ముందు ఆదిత్యా బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంకు సేవలను ప్రారంభించిది. ఇది ఫిబ్రవరి 22న జరిగింది.
10. పోస్టల్ విభాగం కూడా పేమెంట్స్ బ్యాంకు సేవలను pilot basisలో ప్రస్తుతం ఆఫర్ చేస్తోంది.

English summary
Jio Payments Bank, Joint Venture Of Reliance Industries (RIL) And SBI, Begins Operation: 10 Points
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot