Home
News

Jio Phone 5G ఫోటోలు లీక్.. ధర కేవలం రూ.10,000..?

భారత్‌లో జియో తన ఆఫర్‌లతో టెలికాం రంగంలో ఒక ట్రెండ్‌ను సెట్‌ చేసింది. జియో 4Gతో డేటా వినియోగంలో భారత్‌ అనేక రికార్డులు సృష్టించింది. జియోతో పోటీ పడేందుకు మిగిలిన టెలికాం సంస్థలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది.

జియో నుంచి 5G స్మార్ట్‌ ఫోన్‌ Jio phone 5G రానుందని తెలుస్తోంది. జియో 5G ఫోన్‌ ఈ సంవత్సరంలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే విడుదలకు ముందు జియో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్‌ అయ్యాయి.

Jiophone 5G

జియోఫోన్ 5Gకు సంబంధించిన కొన్ని ఫోటోలను టిప్‌స్టర్‌ @ArpitNahiMila తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫోటో ఆధారంగా జియో 5G ఫోన్‌ 13MP AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) కెమెరా, మరియు 2MP మాక్రో కెమెరా ఉంది. LED ప్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. ముందు వైపు 5MP కెమెరా ఉండే అవకాశం ఉంది.

డిస్‌ప్లే 6.6 అంగుళాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ముందు ప్యానల్ వాటర్‌డ్రాప్‌ నాచ్‌ను కలిగి ఉంది. లీక్‌ అయిన ఫోటోలో జియో ఫోన్‌ ముందు ప్యాన్‌లో జియో 5G స్పీడ్‌ టెస్ట్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఏ ప్రాంతంలో స్పీడ్‌ టెస్టు చేశారో తెలియకపోయినా.. డౌన్‌లోడ్‌ స్పీడ్‌ మాత్రం 479Mbpsగా కనిపిస్తోంది. ఈ ఫోటోను బట్టి చూస్తే ఈ ఫోన్ డమ్మీగా అనిపిస్తోంది. అయితే విడుదల సమయంలో జియో 5G ఫోన్‌ కాస్త భిన్నంగా కనిపించవచ్చు.

ఈ ఫోటోను లీక్‌ చేసిన ట్వీట్టర్‌ యూజర్‌ కూడా జియో ఫోన్‌ 700 SoC డెమెన్సిటీ లేదా Unisoc 5G చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంటుందని తెలిపాడు. ఈ ఫోన్‌ను ఈ సంవత్సరం దీపావళికి లేదా 2024 కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్‌ ధర రూ. 10,000 లోపు ఉంటుందని తెలుస్తోంది.

Jiophone 5G

గూగుల్‌తో జియో భాగస్వామ్యం కారణంగా జియో 5G స్మార్ట్‌ఫోన్ ప్రగతిOS (టైలార్డ్‌ ఆండ్రాయిడ్‌OS) ను కలిగి ఉంటే అవకాశం ఉంది. జియో సిమ్‌ వినియోగదారులు ఈ ఫోన్‌ కొనుగోలు చేసినట్లయితే కొన్ని అదనపు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే జియో తన వినియోగదారులకు 5G డేటాను ఉచితంగా వినియోగించుకొనే అవకాశం కల్పిస్తోంది. జియో ప్రీపెయిడ్‌ వినియోగదారులకే ఈ ఆఫర్‌ వర్తిస్తోంది.

జియోఫోన్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌ మరియు 32GB / 64GB అంతర్గత స్టోరేజీను కలిగి ఉండే అవకాశం ఉంది. మెమోరి కార్డు కోసం అదనపు స్లాట్‌ ఉంటుందని సమాచారం. అలాగే 5000mAh బ్యాటరీ సామర్థ్యం మరియు 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో జియోఫోన్ 5G రానున్నట్లు తెలుస్తోంది. మరియు ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Phone 5g smartphone photos leaked and may launch later this year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X