జియో ఫీచర్ ఫోన్ ఎఫెక్ట్ : Airtel కొత్త ఎత్తుగడ

Written By:

గత కొద్ది రోజుల నుంచి సంచలనపు విషయం ఏదైనా ఉందంటే అది జియో ఫోన్ మాత్రమేనని చెప్పాలి. జియో ఉచితంగా తమ ఫీచర్ ఫోన్ అందిస్తామని చెప్పడంతో వినియోగదారుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంటే టెక్ వర్గాల్లో మాత్రం కలవరం మొదలైంది. ఈ కలవరాన్ని తగ్గింజుకునేందుకు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ సరికొత్త ఎత్తుగడతో వస్తోంది.

మీ తలరాత ఇకపై కేంద్ర ప్రభుత్వం చేతిలో, ప్రాజెక్ట్ ఇన్‌సైడ్‌ వస్తోంది..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బండిల్‌ ఆఫర్లను

జియోలాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేయకుండా.. ఇప్పటికే ఉన్న కంపెనీలతో జట్టుకట్టి బండిల్‌ ఆఫర్లను ప్రకటించాలని ఎయిర్‌టెల్ యోచిస్తోంది.

జియో ఒక్కటే

ప్రస్తుతం జియో ఒక్కటే దేశంలో వీవోఎల్‌టీఈ సేవలను అందిస్తుండగా.. ఎయిర్‌టెల్‌ సైతం వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సేవలను ప్రారంభించబోతోంది.

అదే తరహా ఫోన్లను

మరోవైపు జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ తీసుకొస్తున్న నేపథ్యంలో ఫీచర్‌ ఫోన్లను తయారుచేసే కంపెనీలు మైక్రోమ్యాక్స్‌, ఇంటెక్స్‌, కార్బన్‌ వంటివి కూడా అదే తరహా ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేయాలనుకుంటున్నాయి.

ఆయా సంస్థలతో జట్టుకట్టి

ఈ క్రమంలో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై బండిల్‌ ఆఫర్లను ఇస్తున్న ఎయిర్‌టెల్‌.. ఆయా సంస్థలతో జట్టుకట్టి తదుపరి తీసుకురాబోయే ఫోన్లకు బండిల్‌ ఆఫర్లను ప్రకటించనుంది.

ఒక్క సిమ్‌ మాత్రమే

10కోట్ల మంది వినియోగదారులను చేరవయ్యే లక్ష్యంగా జియో తీసుకొస్తున్న ఫీచర్‌ ఫోన్‌లో ప్రస్తుతం ఒక్క సిమ్‌ మాత్రమే వేసుకునే అవకాశం ఉంది. అది కూడా కేవలం జియో నెట్‌వర్క్‌ మాత్రమే పనిచేసే విధంగా లాక్‌ చేస్తున్నారు.

ఇదే పద్ధతిని

ఇదే పద్ధతిని ఎయిర్‌టెల్‌ సైతం అవలంబించబోతోంది. ఇక మిగిలిన టెలికాం కంపెనీలు ఎలాంటి ఎత్తుగడలకు తెరలేపుతాయన్న అంశంపై టెక్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Phone: Airtel Plans to Beat the 'Free' Reliance Phone With Bundled Offers Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot