ఆగష్టు 24 నుంచి జియోఫోన్ బుకింగ్స్, మీకూ రిమైండర్ కావాలా..?

వారానికి 50 లక్షల ఫోన్‌లు డెలివరీ..

|

దేశవ్యాప్తంగా ఎక్కడచూసినా రిలయన్స్ లాంచ్ చేసిన జియోఫోన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆగష్టు 24 నుంచి ప్రీ-బుకింగ్స్‌కు సిద్ధమవుతోన్న ఈ ఫోన్ పై భారీ స్థాయిలోనే అంచనాలు అలుముకున్నాయి.

రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌తో..

రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌తో..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించిన వివరాల ప్రకారం జియోఫోన్‌ ప్రతి ఒక్కరికి ఉచితంగా లభిస్తుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ క్రింద ముందుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత తిరిగి రీఫండ్ చేసేస్తారు.

ఆగష్టు 24 నుంచి ప్రారంభం..

ఆగష్టు 24 నుంచి ప్రారంభం..

జియోఫోన్‌కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ఆగష్టు 24 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టంబర్ నుంచి ఫోన్ల‌ను డెలివరీ చేస్తారు. జియో ఫోన్ బుకింగ్ ప్రాసెస్ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా జరుగుతుందని తెలుస్తోంది.

MyJio appను ఓపెన్ చేసి..

MyJio appను ఓపెన్ చేసి..

జియో ఫోన్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకునే వారు ఆగష్టు 24న MyJio appను ఓపెన్ చేసినట్లయితే ఫోన్‌ను బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈలోపే మీరు https://www.jio.com వెబ్‌సైట్‌లోకి లాగినై Keep Me Posted అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలను ఫిల్ చేసినట్లయితే ఫోన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ మీకు అందుతాయి.

 వ్యాపారస్తులకు అవకాశం...

వ్యాపారస్తులకు అవకాశం...

ఈ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని వ్యక్తిగత యూజర్లకే కాకుండా వ్యాపారస్తులకు కూడా జియో కల్పిస్తోంది. జియోఫోన్‌లను బుక్ చేసుకునే బిజినెస్ ఓనర్స్ పాన్ లేదా GSTN నెంబర్‌ను సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. వీళ్లు 50 కూడా ఎక్కువ ఫోన్‌లను ఆర్డర్ చేసే వీలుంటుంది.

MyJio యాప్ అందుబాటులో‌లేని యూజర్లు

MyJio యాప్ అందుబాటులో‌లేని యూజర్లు

MyJio యాప్ అందుబాటులో‌లేని యూజర్లు సమీపంలోని జియో రిటైలర్ వద్దకు వెళ్లి ఆఫ్‌లైన్ ప్రాసెస్‌లో జియో ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వారికి సెప్టంబర్‌లో డెలివరీ ఉంటుంది. సెప్టంబర్ నుంచి వారానికి 50 లక్షల జియోఫోన్ యూనిట్‌లను డెలివరీ చేస్తామని రిలయన్స్ చెబుతోంది.

జియోఫోన్ స్పెసిఫికేషన్స్

జియోఫోన్ స్పెసిఫికేషన్స్

2.4 అంగుళాల డిస్‌ప్లే, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

 

 ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో

ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో

జియో ఫోన్ ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఫీచర్‌తో వస్తోంది. ఫోన్ కీప్యాడ్‌లోని 5 బటన్ పై లాంగ్‌ప్రెస్ ఇవ్వటం ద్వారా ఎమర్జెన్సీ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ముందుగానే సెట్ చేసుకుని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఈ ఎమర్జెన్సీ మెసేజ్ లోకేషన్ తో సహా షేర్ చేయబడుతుంది.

జియోఫోన్ బ్రౌజర్, ఫేస్‌బుక్..

జియోఫోన్ బ్రౌజర్, ఫేస్‌బుక్..

జియో‌ఫోన్‌లో జియో యాప్స్‌ సూట్‌తో పాటు జియోఫోన్ బ్రౌజర్, ఫేస్‌బుక్, నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌బ్రాడ్ కాస్ట్ యాప్‌లను పొందుపరిచారు. వాయిస్ కమాండ్‌లను జియో ఫోన్ సపోర్ట్ చేస్తుంది. తెలుగుతో సహా 22 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా UPI అలానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు చెల్లింపులను సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
jio Phone Booking Starting on August 24: Registration Process for Consumers and Businesses. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X