జియో ఫీచర్ ఫోన్‌లో వేరే కంపెనీ సిమ్ పనిచేయదు !

Written By:

జియో నుంచి రానున్న ఫీచర్ ఫోన్ పై కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. రూ.1500 డిపాజిట్‌తో లభించనున్న ఈ ఫోన్ ఆగస్టు 24 నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో కేవలం ఒక్క సిమ్ కే అవకాశం ఉందట. ఈ ఫోన్ డ్యుయల్ సిమ్ ఫీచర్‌తో రావడం లేదని తెలిసింది. అది కూడా వీవోఎల్‌టీఈ ఫీచర్ ఉన్న సిమ్ మాత్రమే ఈ ఫోన్‌లో పని చేస్తుంది.

జియో ఫీచర్ ఫోన్‌తో ఆదాయం ఎలా వస్తుందంటే..

జియో ఫీచర్ ఫోన్‌లో వేరే కంపెనీ సిమ్ పనిచేయదు !

అంటే.. ప్రస్తుతం వీవోఎల్‌టీఈని అందిస్తున్నది దేశంలో జియో మాత్రమే కనుక, కేవలం ఆ సంస్థకు చెందిన సిమ్‌లు మాత్రమే జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో పనిచేస్తాయన్నమాట. ఇతర నెట్‌వర్క్‌లకు చెందిన సిమ్‌లను వేసుకోలేం. అయితే భవిష్యత్తులో ఈ ఫోన్‌కు చెందిన డ్యుయల్ సిమ్ వేరియెంట్‌ను తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు జియో ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఫోన్ పై అనేక సందేహాలు కూడా ఉన్నాయి.

జియో ఉచిత వైఫై, వారికి మాత్రమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో వాట్సప్ ?

జియో 4జీ ఫీచర్ ఫోన్ నడిచేది పూర్తిగా విభిన్నమైన ఆపరేటింగ్ సిస్టమ్‌తో. ఆ ఫోన్ కోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారు. కనుక అందులో వాట్సప్ రాదు. కానీ యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్‌ను అందించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా అందులో ఇచ్చే జియో చాట్ యాప్‌ను వాడుకోవాల్సి ఉంటుంది.

రెండు మోడల్స్‌లో

ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్పెసిఫికేషన్లను జియో వెల్లడించలేదు. కానీ చైనాకు చెందిన స్ప్రెడ్‌ట్రమ్ కమ్యూనికేషన్‌తోపాటు మరో ప్రాసెసర్ తయారీ సంస్థ అయిన క్వాల్‌కామ్ కూడా జియోతో కలసి పనిచేస్తున్నట్టు గతంలో చెప్పాయి. కనుక స్ప్రెడ్‌ట్రమ్ ప్రాసెసర్, క్వాల్‌కామ్ ప్రాసెసర్‌తో ఉండే జియో 4జీ ఫోన్ రెండు మోడల్స్‌లో విడుదలయ్యేందుకు అవకాశం ఉంది.

 

రీచార్జి

రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఫోన్ కొన్నాక కనీసం 90 రోజులకు ఒకసారి అందులో వాడే సిమ్‌లను రీచార్జి చేయించుకోవాలి. అలా చేస్తేనే ఆ ఫోన్‌కు గాను 3 ఏళ్ల తరువాత సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇస్తారు. లేదంటే ఇవ్వరు.

 

ప్రీ బుకింగ్ చేసేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్

జియో 4జీ ఫోన్ కావాలనుకునే వినియోగదారులు ఫోన్ కోసం ప్రీ బుకింగ్ చేసేటప్పుడే రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఆర్డర్ కన్‌ఫాం అయి డెలివరీ అవుతుంది.

 

జియో కేబుల్ టీవీ

జియో ఫోన్‌కు అనుసంధానించుకునే కేబుల్‌ను రూ.500 వరకు అదనంగా వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందట. దాంతోపాటు నెలకు రూ.309 ప్లాన్‌ను కచ్చితంగా తీసుకుంటేనే ఆ కేబుల్‌ను వాడుకునే వీలుంటుందని తెలిసింది. 

వైఫై హాట్ స్పాట్

జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో వైఫై హాట్ స్పాట్ లేదు. దీంతో ఈ ఫోన్‌లో ఉన్న ఇంటర్నెట్‌ను ఇతర డివైస్‌లకు షేరింగ్ ద్వారా పొందలేము.

 

రోజుకు 500 ఎంబీ డేటా

జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను కొని అందులో వాడే సిమ్‌ను రీచార్జి చేసుకున్నాక రోజుకు 500 ఎంబీ డేటా లభిస్తుందని చెప్పారు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Phone Confirmed to Be a Single SIM Mobile Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot