దివాళి కానుకగా 'గిఫ్ట్ కార్డ్' లాంచ్ చేసిన జియో
దివాళి పండుగను పురస్కరించుకుని జియో ఫోన్ గిఫ్ట్ కార్డ్ ను జియో సంస్థ లాంచ్ చేసింది. రూ.1095 ధరకు ఈ గిఫ్ట్ కార్డు వినియోగదారులకు లభిస్తుంది.
దివాళి పండుగను పురస్కరించుకుని జియో ఫోన్ గిఫ్ట్ కార్డ్ ను జియో సంస్థ లాంచ్ చేసింది. రూ.1095 ధరకు ఈ గిఫ్ట్ కార్డు వినియోగదారులకు లభిస్తుంది. దీన్ని పండుగ సందర్భంగా ఎవరైనా తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇతరులకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.ఈ జియో ఫోన్ గిఫ్ట్ కార్డులను వినియోగదారులు అమెజాన్ లేదా రిలయన్స్ డిజిటల్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

12 నెలల వ్యవధి.....
12 నెలల వ్యవధి గిఫ్ట్ కార్డు మీద ఉన్న తేదీ నుండి 12 నెలల వ్యవధిలో బహుమతి కార్డు చెల్లుతుంది. ఈ గిఫ్ట్ కార్డు అందుకున్న వారు తమ వద్ద ఉన్న ఏదైనా పాత 2జీ/3జీ/4జీ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసి జియో ఫీచర్ ఫోన్‌ను పొందవచ్చు. దీంతో రూ.501 మొత్తం ఆ కార్డులో తగ్గించబడుతుంది.

రూ.594 మొత్తానికి సదరు ఫోన్‌లో....
ఇక మిగిలిన రూ.594 మొత్తానికి సదరు ఫోన్‌లో 6 నెలల విలువ గల రీచార్జి ప్యాక్‌ను ఇస్తారు. రూ.99 నెలవారీ ప్లాన్ ప్రాతిపదికన ఆ మొత్తం వినియోగించబడుతుంది. రూ.99 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 500 ఎంబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. దీంతోపాటు మరో 6 జీబీ అదనపు డేటాను ఉచితంగా అందిస్తారు.

జియో స్పెషల్ యాన్యువల్ ప్లాన్....
దివాళి సందర్భంగా జియో స్పెషల్ యాన్యువల్ ప్లాన్ తీసుకొచ్చింది.రూ.1699తో రీఛార్జ్ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. అంతేకాక రూ.149 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.

రూ.1699...
ఈ రూ.1699 ప్లాన్ కింద ఉచితంగా లోకల్, నేషనల్ కాల్స్, అపరిమిత రోమింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్ లైవ్‌లోకి తీసుకొచ్చింది.

రిలయన్స్ జియో దివాళి క్యాష్ బ్యాక్ ఆఫర్...
రూ.149 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.ఓ సారి లిస్ట్ చెక్ చేసుకోండి


Click it and Unblock the Notifications








