జియో ఉచిత ఫోన్‌లో పెద్ద మైనస్‍లు ఇవే !
టెలికాం మార్కెట్లో మరో సంచలనానికి తెర తీసింది రిలయన్స్.
టెలికాం మార్కెట్లో మరో సంచలనానికి తెర తీసింది రిలయన్స్. జియో 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. మేడిన్ ఇండియా నినాదంతో ముఖేష్ అంబానీ ఈ ఫోన్ ను ప్రకటించారు. ఇండియా కా స్మార్ట్ ఫోన్.. జియోఫోన్ గా అభివర్ణించారు. అయితే ఆ ఫోన్ ఫీచర్లపై కొందరు అప్పుడే పెదవి విరుస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

వాట్సప్
ప్రస్తుతం యావత్ ప్రపంచం వాట్సప్ వైపు పరుగులు పెడుతోంది. మన ఇండియా కూడా దీని వాడకంలో టాప్ పొజిషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఫీచర్ జియో ఫోన్ లో లేకపోవడం పెద్ద మైనస్సే.

ఫేస్‌బుక్
ఇక రెండో ఫీచర్ ఫేస్‌బుక్..24 గంటలూ జనాలు దీనిమీద నిద్రలేని రాత్రులు గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ కూడా లేదు.

జియో యాప్స్ ను
జియో యాప్స్ ను ఇన్ బిల్ట్ ఇస్తున్న ఈ జియో ఫోన్ లో వాట్సప్, ఫేస్‌బుక్ లను కూడా ఇన్ బిల్ట్ గా ఇచ్చి ఉంటే ఈ ఫోన్ మరో సంచలనానికి వేదికగా మారేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

డేటా లిమిట్
ఇక ఈ ఫోన్ కు ఉచితంగా రోజుకు డేటా లిమిట్ ను కూడా 500 ఎంబీ మాత్రమే ఇస్తున్నారు.

సెక్యూరిటీ డిపాజిట్
ఫోన్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 కట్టమనడం. అది 3 ఏళ్ల తరువాత రీఫండ్ చేస్తామనడం కూడా తెలిసిందే. ఇందులో కూడా మర్మం లేకపోలేదని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








