జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !

21 నుంచి ఫోన్ల డెలివరీ కానున్న నేపధ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించి గిజ్‌బాట్ తెలుగు మీ కోసం స్పెషల్‌గా రివ్యూని అందిస్తోంది.

By Hazarath
|

జియో ఫోన్..బుకింగ్‌లతోనే మార్కెట్లో ఓ ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ఉచితంగా ఫోన్ ఇస్తామన్న ముకేష్ అంబానినే ఆశ్చర్యానికి గురిచేస్తూ రెండు రోజుల్లోనే దాదాపు కోటి ఫోన్ల దాకా బుక్ అయ్యాయి. జియో కేవలం 36 గంటలు మాత్రమే బుకింగ్స్ కు ఈ ఫోన్ అనుమతిచ్చిందంటే దాని స్పందన ఏంటో తెలుసుకోవచ్చు. 21 నుంచి ఫోన్ల డెలివరీ కానున్న నేపధ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించి గిజ్‌బాట్ తెలుగు మీ కోసం స్పెషల్‌గా రివ్యూని అందిస్తోంది. ఓ స్మార్ట్ లుక్కేయండి.

అనుమానాలన్నీ పటాపంచల్, ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడించిన జియోఅనుమానాలన్నీ పటాపంచల్, ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడించిన జియో

చేతులు ఉపయోగించకుండానే SMS పంపే అవకాశం

చేతులు ఉపయోగించకుండానే SMS పంపే అవకాశం

గూగుల్ అసిస్టెంట్, ఆపిల్ సిరి, మైక్రోసాఫ్ట్ కొర్టానా మాదిరిగానే జియో ఫోన్ కూడా వాయిస్ ఎనేబుల్డ్ గా తయారైంది. అంటే మీ చేతులు ఉపయోగించకుండానే SMS పంపే అవకాశం ఉంది. వాయిస్ ద్వారానే కాల్స్, సందేశాలు పంపుకోవచ్చు.

ఫ్రీ లోడెడ్ యాప్స్

ఫ్రీ లోడెడ్ యాప్స్

జియో ఫోన్ లో మైజియో, మ్యూజిక్, సినిమా, జియో టివి, జియో మని, జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ లాంటి ఫ్రీ లోడెడ్ యాప్స్ ఉన్నాయి. వీటిని మీరు సపరేట్ గా డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు.

23 రకాల భాషలు

23 రకాల భాషలు

ఈ ఫోన్ లో దాదాపు 23 రకాల భాషలు ఉన్నాయి. మీకు నచ్చిన భాషని ఎంపిక చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.

ఎమర్జెన్సీ బటన్
 

ఎమర్జెన్సీ బటన్

ఇందులో ఓ ఎమర్జెన్సీ బటన్ ఉంది. మీరు జియో ఫోన్ నుంచి 5 బటన్ ట్యాప్ చేయడం ద్వారా 100, 108లాంటి వాటికి కాల్ వెళుతుంది.

టీవికి అనుసంధానం

టీవికి అనుసంధానం

ఈ ఫోన్ లో సరికొత్తగా టీవికి అనుసంధానం చేసే ఫీచర్ ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా మీరు టివిలో మీకు నచ్చినది చూసే అవకాశం ఉంది. ఏ టివికైనా సెట్ అయ్యే విధంగా ఈ ఫీచర్ ని రూపొందించారు.

కేవలం నలుపు రంగులో మాత్రమే

కేవలం నలుపు రంగులో మాత్రమే

ఇది కేవలం నలుపు రంగులో మాత్రమే లభిస్తుంది. నలుపంటే ఇష్టపడేవారికి జియో ఫోన్ చాలా బాగా నచ్చుతుంది.

ఇక జియో ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

ఇక జియో ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

కొనేందుకు కారణాలు

కొనేందుకు కారణాలు

ఈ ఫోన్ పూర్తిగా ఉచితం. ఫస్ట్ రూ. 1500 డిపాజిట్ కింద తీసుకున్నా మూడేళ్ల తరువాత అది తిరిగి రీఫండ్ చేస్తామని జియో చెబుతుంది కాబట్టి పూర్తిగా ఉచితంగా లభిస్తోంది.

 కొనేందుకు కారణాలు

కొనేందుకు కారణాలు

అతి తక్కువ ధరలో వీడియో కాలింగ్ సపోర్ట్ తో లభిస్తున్న ఫోన్ జియో ఫోన్ ఒక్కటే. ఇదో అద్భుతమైన ఫీచర్

NFC సాఫ్ట వేర్ అప్ డేట్

NFC సాఫ్ట వేర్ అప్ డేట్

ఫోన్ వచ్చిన తరువాత NFC సాఫ్ట వేర్ అప్ డేట్ కానున్న నేఫథ్యంలో మీరు లావాదేవీలన్నీ ఈ ఫోన్ ద్వారానే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మరే ఇతర తక్కువ బడ్జెట్ ఫోన్లలో లేదు.

ఎందుకు కొనకూడదు

ఎందుకు కొనకూడదు

ఇందులో హాట్ స్పాట్ ఆప్సన్ లేదు. మీరు ఈ డివైస్ నుంచి మీ డేటాను ఇతర ఫోన్లకు ల్యాపీలకు కనెక్ట్ చేసుకోలేరు.

ఎందుకు కొనకూడదు

ఎందుకు కొనకూడదు

ఈ ఫోన్లో ఇదో పెద్ద మైనస్ గానే భావించాలి. వాట్సప్ ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్న తరుణంలో ఈ ఆప్సన్ లేకపోవడం నిజంగా నిరాశ కలిగించే అంశమే. అయితే జియో చాట్ కొంచెం ఆశ కలిగించే అంశం.

ఎందుకు కొనకూడదు

ఎందుకు కొనకూడదు

ఈ ఫోన్ సింగిల్ సిమ్ తో వస్తుంది కాబట్టి డ్యూయెల్ సిమ్ వాడే అభిమానులకు ఇది నచ్చకపోవచ్చు.

ఎందుకు కొనకూడదు

ఎందుకు కొనకూడదు

రిపోర్టుల ప్రకాం ఈ ఫోన్ కేవలం 153 రీ ఛార్జ్ మీదనే నడుస్తుంది. మిగతా రీఛార్జ్‌లు దీనికి పనిచేయవని తెలుస్తోంది. రూ. 153 ప్లాన్‌తో మీకు అన్‌లిమిటెడ్ కాల్స్, అలాగే ఎసెమ్మెస్‌లు, 500 ఎంబి డేటా లభిస్తుంది. డేటా అధికంగా వాడేవారికి ఇది నిరాశే.

ఫైనల్ రివ్యూ

ఫైనల్ రివ్యూ

ఏది ఏమైనా జియో ఫోన్ మార్కెట్లో ఓ సంచలనమే. ఎంట్రీ లెవల్లో జియో ఫోన్ బెస్ట్ ఫీచర్లను అందిస్తోంది. ఇతర హ్యాండ్ సెట్లతో పోలిస్తే ఈ ఫోన్ ఎన్నో రెట్లు బెటర్ అని చెప్పవచ్చు. నవరాత్రికి ఈ ఫోన్లు డెలివరీ కానున్నాయి.

Best Mobiles in India

English summary
Jio Phone Review Reasons Why You Should Buy And Should Not Buy Read more At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X