రోజువారీ డేటా ఖర్చు అయిపోయిందా.. రూ.100 కంటే తక్కువ ధరలో డేటా ప్యాక్స్ మీకోసం..!
ప్రముఖ టెలికాం సంస్థ జియో యూజర్ల పరంగా తొలి స్థానంలో ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అదనపు డేటా అవసరాలు ఉండే వారి కోసం ప్రత్యేకంగా డేటా ప్యాక్స్‌ను కలిగి ఉంది. రూ.11 నుంచే జియో డేటా ప్యాక్స్ ను కలిగి ఉంది. జియో అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా రూ.100 కంటే తక్కువ ధరలో జియో డేటా ప్యాక్స్ లిస్ట్, పూర్తి ప్రయోజనాల వివరాలు మీకోసం.
రూ.11 రీఛార్జ్ ప్లాన్ :
ఈ డేటా ప్యాక్ లో (Jio Rs11 Data Pack) యూజర్లు 10GB హైస్పీడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64kbps కు తగ్గుతుంది. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1 గంట మాత్రమే. డేటా మినహా ఈ ప్లాన్ లో ఎటువంటి అదనపు ప్రయోజనాలను అందించడం లేదు.

రూ.19 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Jio Rs19 Data Pack) భాగంగా యూజర్లు 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64 kbps కు తగ్గుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1 రోజుగా ఉంది. డేటా మినహా ఈ ప్లాన్ లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు.
రూ.29 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Jio Rs29 Data Pack) భాగంగా యూజర్లు 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం డేటా వేగం 64 kbps గా ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 2 రోజులుగా ఉంది. డేటా మినహా ఈ ప్లాన్ లో ఎటువంటి అదనపు ప్రయోజనాలను అందించడం లేదు.
రూ.49 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Jio Rs49 Data Pack) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఇందులో 25GB హైస్పీడ్ డేటా ను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64 kbps గా ఉంటుంది. ఈ ప్లాన్ లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1 రోజుగా ఉంది.
రూ.69 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs69 Data Pack) భాగంగా యూజర్లు 6GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 64kbps గా ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంటుంది. డేటా మినహా ఎటువంటి కాలింగ్, SMS లను అందించడం లేదు.
రూ.100 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Jio Rs100 Data Pack) యూజర్లు 5GB డేటాను పొందుతారు. మరియు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. డేటా మినహా ఎటువంటి కాలింగ్, SMS లను అందించడం లేదు.


Click it and Unblock the Notifications








