Just In
- 12 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 14 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 17 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 18 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- News
బాలకృష్ణకు `కాపు`నాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- `పొత్తు` పోతుందనే భయం..?!
- Movies
Pathaan షారుక్ బాక్సాఫీస్ రచ్చ.. బాహుబలికి రికార్డుకు చేరువగా.. తొలి రోజే 100 కోట్లు?
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Jio లో ఏడాది వ్యాలిడిటీతో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇదే.. ఓ లుక్కేయండి!
Airtel, Vodafone Idea లతో పోల్చుకుంటే రిలయన్స్ జియో వినియోగదారులకు ఆకర్షణీయ ప్లాన్లతో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా అందుబాటు ధరల్లో పలు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అందిస్తోంది. కంపెనీ ఎల్లప్పుడూ తమ కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లను ప్రారంభించడంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తుంది. 2022 ప్రారంభంలో, రిలయన్స్ Jio వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు పుష్కలమైన డేటాను పొందుతారు.. అంతేకాకుండా ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు కూడా ఇది సరైన ఎంపిక. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆ ప్లాన్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ Jio రూ.2,999 ప్లాన్:
రిలయన్స్ Jio కు సంబంధించి 2022 ప్రారంభంలో విడుదలైన దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.2,999. లాంగ్ టర్మ్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని జియో ఈ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు.
ఈ ప్లాన్ ద్వారా ఏడాది మొత్తంలో కంపెనీ 912.5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తోంది. దాంతో పాటు పలు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తోంది. ఇంకా అదనంగా జియో యూజర్లు Jio టీవీ, Jio సినిమా, Jio సెక్యురిటీ, Jio క్లౌడ్ యాక్సెస్ కూడా కల్పిస్తోంది. FUP లిమిట్ దాటిన తర్వాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఇదే కాకుండా రూ.4199 ప్లాన్ ద్వారా కూడా ఇదే తరహా జియో దీర్ఘకాల ప్రయోజనాల్ని కల్పిస్తోంది. ఈ ప్లాన్‌తో డైలీ డేటా 3జీ పొందవచ్చు. కానీ, రెండిటినీ పోల్చుకుంటే రూ.2999 ప్లాన్‌తో తక్కువ ధరలో దీర్ఘకాల ప్రయోజనాల్ని పొందవచ్చు.

84 రోజుల వ్యాలిడిటీతో రూ.1,499 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది:
రిలయన్స్ Jio నుంచి ఈ ఏడాది విడుదలైన గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రూ.1499 ప్లాన్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ద్వారా కూడా యూజర్లు మంచి ప్రయోజనాల్ని పొందవచ్చు. ఈ రూ.1499 ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా చొప్పున పొందవచ్చు. అంటే మొత్తంగా 168 జీబీ డేటాను ఈ ప్లాన్ అందిస్తుంది. దీని ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 మెసేజ్‌లతో పాటు ఏడాది పాటు డిస్నీ హాట్ స్టార్ ప్రీమియం యాక్సెస్‌ను పొందవచ్చు. అలాగే జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ, జియో సినిమాలకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది.
ఇక Jio ఫైబర్ బ్రాడ్‌బ్రాండ్‌లో బెస్ట్ సెల్లింగ్ ప్లాన్ ఏదంటే!
బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో జియోఫైబర్ ను ఎంచుకున్న వారు అధికంగా రూ.1499 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్లాన్ అని ఇప్పుడు కంపెనీ విడుదల చేసింది. చాలా మంది వినియోగదారులు ఈ ప్లాన్ ను ఎంచుకుంటున్నందున ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే రూ.1499 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వినియోగదారులకు 300 Mbps ఇంటర్నెట్ వేగంతో డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అందించే డేటా అపరిమితంగా ఉంటుంది. అయితే ఇక్కడ అపరిమిత అంటే నెలకు 3.3TB FUP (న్యాయమైన-వినియోగ-విధానం) పరిమితి డేటాగా ఉంటుంది. ఈ ప్లాన్‌తో డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ డేటా ప్రయోజనం రెండింటికీ సమరూపంగా ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470